Theaters: ఇక థియేటర్స్ అన్ని కూడా పెళ్లిళ్లకు వాడాల్సిందేనా ?

అవును.మీరు వింటుంది నిజమే.

 What Will Happen To Theaters Very Soon , Theater, Dilraju , Ott, Movies, Family-TeluguStop.com

గత కొన్ని రోజుల్లో థియేటర్స్ అన్ని కూడా పెళ్లిళ్లకు, పెద్ద మనిషి ఫంక్షన్స్ కి వాడుకోవాల్సిందే.ఎందుకు ఆలా అంటున్నారు అని అనుకుంటున్నారా ? సినిమా చూడటానికి ఏ ఒక్కరు థియేటర్ కి వెళ్లకపోతే థియేటర్ లతో పని ఏముంది చెప్పండి.ఒకప్పుడు అంటే సినిమా వస్తుంది అంటే అభిమానుల గోల, హడావిడి, కలెక్షన్స్, సక్సెస్ పార్టీ ఇలా చాల చేసేవారు.కానీ ఇప్పుడు అస్సలు సినిమా చూడటానికి ఎవరు థియేటర్ కి వెళ్తున్నారు.

వెళ్లకుండా చేసింది సినీ పెద్దలే.టికెట్స్ రేట్స్ ఇంతలా పెంచక జనాల్లో సినిమా చూడాలన్న ఆసక్తి చచ్చిపోయింది.

పోనీ ఎలాగోలా ఆ టికెట్ రేటు భరించి థియేటర్ కి వెళ్దాం అనుకుంటే ట్రాఫిక్, క్యాంటిన్, పార్కింగ్ ఖర్చులతో తడిసి మోపెడు అవుతుంది.ఒక్కరు థియేటర్ కి వెళ్లడం ఎలాగోలా భరించిన, కుటుంబం మొత్తం సినిమా చూడాలంటే మాత్రం సగం జీతం హుష్ కాకి.

అందుకే అసలు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎప్పుడో థియేటర్ కి దూరం అయ్యారు.ఇప్పడు ఆ కాస్త అభిమానులు, యూత్ సైతం థియేటర్ వైపు వెళ్లకుండా ఓటిటి అంటూ వచ్చిన ప్రతి సినిమా చూస్తున్నారు.

ఇక్కడ అప్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్క సినిమా కోసం ఎందుకు డబ్బంతా ఖర్చు చేస్తారు.

Telugu Dilraju, Audience, Theater, Theaters, Tollywood, Happen Theaters-Telugu S

ఇక ఒక రోజు సినిమాకి వెళ్లి వచ్చే డబ్బుతో ఏకంగా ఏడాది ప్రైమ్ అకౌంట్ లభిస్తుంది.అన్ని భాషల్లో సినిమాలు చూసే అవకాశం వుంది.ఇన్ని సౌలభ్యాలు అరచేతిలో పెట్టుకొని అవస్థ పడే పరిస్థితికి సగటు మనిషి ఎందుకు వెళ్తాడు చెప్పండి.

అందుకే దిల్ రాజు లాంటి వ్యక్తి ఈ ఓటిటి లను బాహాటమగానే విమర్శిస్తున్నారు.సినిమాను చంపేశారు అంటూ విరుచుకుపడుతున్నారు.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే థియేటర్స్ ని ఫంక్షన్ హాల్స్ గా మార్చేయడం పక్క.పైగా థియేటర్స్ కోసం కష్టాలు పడాల్సిన అవసరం లేకుండా చిన్న సినిమాలను ఏకముగా ఓటిటి కె ఇచ్చేషు తమ పని తాము చేసుకుంటున్నారు నిర్మాతలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube