Krishna ji rao KGF : హాస్పిటల్ పాలైన కేజిఎఫ్ తాత.. విషమంగా మారిన ఆరోగ్యం!

ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు వరుసగా అనారోగ్యానికి గురవుతూ హాస్పిటల్ పాలు అవ్వడమే కాకుండా చాలామంది కన్నుమూస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి పలువురు సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో చనిపోవడంతో ఇండస్ట్రీ శోకసంద్రంలో ఉండిపోయింది.

 Kgf's Grandfather  ,was Admitted To The Hospital,  Health Has Become Serious, Kr-TeluguStop.com

ఇకపోతే తాజాగా కేజిఎఫ్ నటుడు కూడా హాస్పిటల్ పాలవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న కేజీఎఫ్ సినిమా ద్వారా ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపు పొందారు.

ఈ క్రమంలోనే కేజిఎఫ్ సినిమాలో అందుడి పాత్రలో నటించిన తాత కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా అందుడి పాత్రలో నటించిన ఈయన పేరు కృష్ణ జీ రావు.

ఈయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.అయితే కేజీఎఫ్ సినిమా ఇతనికి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.

ఇలా ఈ సినిమా మంచి హిట్ కావడంతో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది.

Telugu Krishna Ji Rao, Prashanth Neel, Yash-Movie

ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణ జీ రావును కుటుంబ సభ్యులు బెంగుళూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు.ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో తనని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని వైద్యులు వెల్లడించారు.ఇలా ఈ విషయం తెలియడంతో ఎంతో మంది అభిమానులు తాను క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ప్రస్తుతం ఈయనకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube