Chandramukhi Sequels: అయ్యో ..దేవుడా... ఇంకా చెడగొట్టడానికి ఏం మిగిలింది.. చంద్రముఖి...లకలకలక

ఒక సినిమాలో దమ్ముంటే ఎన్ని వెర్షన్స్ లో తీసిన రీమేకులు చేసిన, డబ్బింగ్ చేసిన కేవలం కంటెంట్ తో ఆ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.కాంతారా సినిమా చూసాం కదా.

 Story Behind Chandramukhi Sequels Details, Chandramukhi, Chandramukhi Sequels ,-TeluguStop.com

డబ్బింగ్ చేస్తూ ఎన్ని భాషల్లో వదిలిన సూపర్ హిట్.చివరికి పాన్ ఇండియన్ సినిమా అయ్యింది.

అలాగే దృశ్యం సినిమా కూడా చూసాం.ఇది ఎక్కడ డబ్బింగ్ చేయకుండా కుదిరినంత వరకు అన్ని భాషల్లో రీమేక్ చేసి హిట్స్ కొడుతూనే ఉన్నారు.

అందుకే రీమేక్ అయినా డబ్బింగ్ అయినా కూడా కేవలం కథలో దమ్ము ఉండాలి.అలాంటి ఒక సినిమానే చంద్రముఖి.

ఈ సినిమాను అనేక భాషల్లో తీశారు.కొందరు రీమేక్ చేస్తే కొంత డబ్బింగ్ చేసారు.

మొదటగా ఈ సినిమాను తీసింది మాత్రం 29 ఏళ్ళ క్రితం మలయాళంలో ఫహద్ ఫాజిల్ తండ్రి.మోహన్ లాల్, సురేష్ గోపీ, శోభన లీడ్ రోల్స్ లో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఆ తర్వాత ఇదే చిత్రాన్ని కన్నడ లో విష్ణు వర్ధన్ హీరో గా సౌందర్య తో ఎలాంటి ఇమేజీకి, బిల్డప్ కి పోకుండా కథను మాత్రమే హీరో గా చేస్తూ హీరోయిన్ సెంట్రిక్ మూవీ గా శాస్త్రీయ సంగీతాన్ని, మానసిక సమస్యలను జోడించి మంచి కథను అలాగే తీసాడు విష్ణు వర్ధన్.

Telugu Chandramukhi, Jyothika, Kangana Ranaut, Nagavalli, Nayanthara, Prabhu, Ra

ఆ తర్వాత ఈ సూపర్ హిట్ సినిమాను రజినీకాంత్ హీరోగా, ప్రభు, జ్యోతిక, నయనతార లీడ్ రోల్స్ లో వాసు దర్శకత్వం లో తీయగా దేన్నీ తెలుగులో కూడా డబ్ చేసారు.ఇది రెండు భాషల్లో హిట్ అయ్యింది.రజినీకాంత్ లాంటి హీరో కోసం ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కున్న హీరో ఫైట్స్, పాటలు అంటూ లేని పోనీ జోకులు, సరసాలు కేసుల యాడ్ చేసి మసాలా దట్టించిన సినిమా కథలో బలం ఉంది కాబట్టి సూపర్ హిట్ అయ్యింది.

ఇక చంద్ర ముఖి కి పార్ట్ 2 కూడా ఉంది.

Telugu Chandramukhi, Jyothika, Kangana Ranaut, Nagavalli, Nayanthara, Prabhu, Ra

నాగవల్లి అనే పాత్రను సృష్టించి కన్నడలో విష్ణు వర్ధన్ ఆప్తరక్షక అంటూ తీసాడు.కానీ అట్టర్ ఫ్లాప్.పూర్తిగా సీరియల్ కన్నా దారుణం.

దీన్ని తెలుగులో వెంకటేష్ నాగవల్లి అనే పేరుతో తీయగా అది కూడా ఫ్లాప్.ఇక ఇప్పుడు తమిళ్ లో ఆ బాధ్యతను లారెన్స్ భూయాజన వేసుకున్నాడు.

అంత ఒకే అనుకుంటున్నా టైం లో ఈ ప్రాజెక్ట్ లో కంగనా చేరింది.అసలు ఎలాంటి పొంతన లేని ఈ కాంబినేషన్ ఎలా వర్క్ అవుట్ అవుతుందో ఎలా బ్రష్టు పడుతుందో అని అంత భయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube