తిరుపతి జిల్లా చంద్రగిరిలో నకిలీ పోలీస్ చేతివాటాన్ని ప్రదర్శించాడు.పోలీస్ దుస్తుల్లో వచ్చి ఓ యువకుడి నుంచి బైక్, మొబైల్ ఫోన్ ను చోరీ చేశాడు.
పోలీస్ అని భావించిన సదరు యువకుడు లిఫ్ట్ ఇచ్చాడు.ఈ క్రమంలో మాయమాటలు చెప్పి బైక్, మొబైల్ ఫోన్ తీసుకుని నకిలీ పోలీస్ పరార్ అయ్యాడని సమాచారం.
మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.