Akhil Akkineni Agent Movie : మళ్ళీ అదే తీరుతో నిరుత్సాహ పరిచిన 'ఏజెంట్'.. ఈసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆనందంతో అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వెంటనే ‘ఏజెంట్’ సినిమా స్టార్ట్ చేసాడు.

 Akhil Akkineni's 'agent' Release Date, Agent Release, Akhil Akkineni, Agent Movi-TeluguStop.com

అయితే ఇది ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసాడో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం రిలీజ్ కు నోచుకోవడం లేదు.

ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం విదితమే.

కానీ గత ఏడాది నుండి కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.దీంతో ముందు అనుకున్న రిలీజ్ డేట్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి.

అందుకే ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ చేస్తామని చెప్పినా కూడా రిలీజ్ చేయలేక పోయారు.ఇక అక్టోబర్.

డిసెంబర్.సంక్రాంతి అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు.

ఏది ఏమైనా సంక్రాంతి సీజన్ లో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అని అనుకున్నారు అక్కినేని ఫ్యాన్స్. అయితే సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి వంటి సీనియర్ స్టార్ హీరోలు వస్తున్నారు.

దీంతో ఏజెంట్ సినిమా ఈ టైం లో రావడం సరికాదు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేసారు.ఇలా సంక్రాంతికి ఏజెంట్ రావడం లేదని తేలిపోయింది.

దీంతో మరోసారి అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు.

Telugu Akhil Akkineni, Akhil Akkinenis, Anil Sunkara, Sakshi Vaidya, Surender Re

ఈ క్రమంలోనే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరి ఎట్టకేలకు ఈ సినిమా మేకర్స్ నుండి రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది.మరీ ఎక్కువ గ్యాప్ లేకుండానే ఈ సినిమాను మార్చి మూడు కానీ నాల్గవ వారం కానీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

మరి ఉగాది కానుకగా ఏజెంట్ రిలీజ్ కాబోతుండడంతో సేవలను క్యాష్ చేసుకోవడంలో సఫలం అవుతారో లేదో చూడాలి.ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube