Okkadu Osey Ramulamma: ఒక్కడు, ఒసేయ్ రాములమ్మ సినిమాల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

టాలీవుడ్ నిర్మాత ఎమ్మెస్ రాజు మహేష్ బాబుకు మురారి సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే సినిమా చేద్దామని చెప్పారట.కానీ మహేష్ బాబు ఆ కథ మీద ఆసక్తిని చూపించలేదట.

 Okkadu Mahesh Babu Osey Ramulamma Vijaya Shanthi Details, Okkadu Movie, Osey Ram-TeluguStop.com

అదే సమయంలోనే దర్శకుడు గుణశేఖర్ ఒక్కడు సినిమా కథ చెప్పడంతో ఆ కథ మహేష్ కు బాగా నచ్చి ఆ సినిమాను చేద్దామని చెప్పాడట.కానీ ఆ సినిమా కోసం భారీ ఖర్చుతో చార్మినార్ సెట్ వేయాలి.

చాలా ఖర్చుకు కూడుకున్న వ్యవహారం.అయినప్పటికీ పాయింట్ కొత్తగా ఉంది కనుక ఆ కథ మీద ఆసక్తిని చూపించారట మహేష్ బాబు.

అదే విషయం గురించి ఎమ్మెస్ రాజుకు చెప్పడంతో ఎమ్మెస్ రాజు కూడా ఒక్కడు సినిమాను తీయడానికి ఆసక్తిని చూపించారట.కానీ అంత పెద్ద మొత్తంలో సినిమా తీయడానికి ఆయన దగ్గర డబ్బు కూడా లేదు అందులోనూ మనసంతా నువ్వే సినిమా నిర్మాణ దశలో ఉంది.

ఆ సమయంలో ఎమ్మెస్ రాజు మనసంతా నువ్వే సినిమా హిట్ అయితే ఒక్కడు సినిమా కోసం ఖర్చు పెడతానని చెప్పారట.అప్పుడు మహేష్ బాబు మనసంతా నువ్వే సినిమా హిట్ అయినా కాకపోయినా ఒక్కడు సినిమా మీరు తీయాల్సిందే అని మహేష్ పట్టు పట్టడంతో సరే అని అన్నారట ఎమ్మెస్ రాజు.

ఆ తర్వాత చార్మినార్ సెట్ వేద్దాం అని అనగా చార్మినార్ సెట్ వేయడం వద్దు రియల్ ఛార్మినార్ దగ్గరే షూట్ చేద్దామని అన్నారట.అందుకు ఎమ్మెస్ రాజు వద్దు అన్నట్టుగానే అంగీకరించారు.

ఆ తర్వాత మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది.

Telugu Dasari Yana Rao, Mahesh Babu, Raju, Okkadu, Okkaduosey, Osey Ramulamma, T

ఇక ఆ సినిమా కోసం వచ్చిన డబ్బులు అంతా కూడా ఒకడు సినిమాకి ఖర్చు పెట్టాడట ఎమ్మెస్ రాజు.అంతే కాకుండా భారీ స్థాయిలో చార్మినార్ సెట్ కూడా వేశారు.అలా 14 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఒక్కడు సినిమా 2003 జనవరి 15న విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అంతేకాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది.మరో సినిమా ఒసేయ్ రాములమ్మ.దాసరి నారాయణరావు రూపొందించిన ఒసేయ్ రాములమ్మ సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.అప్పట్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.

అప్పట్లో ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోయే విధంగా పాతికేళ్ళ క్రితమే దాదాపుగా 22 కోట్లు భారీగా వసూలు చేసింది ఒసేయ్ రాములమ్మ సినిమా.

Telugu Dasari Yana Rao, Mahesh Babu, Raju, Okkadu, Okkaduosey, Osey Ramulamma, T

అంతేకాకుండా అప్పట్లోనే ఈ సినిమా సంబంధించి ఐదు లక్షల క్యాసెట్లు కూడా అమ్ముడు అయ్యాయట.ఇక ఈ సినిమాతో విజయశాంతి క్రేజ్ మరొక రేంజ్ కి వెళ్ళింది.కుంతీపుత్రుడు సినిమా తర్వాత విజయశాంతి దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటించిన సినిమా ఇదే.ఇక ఈ సినిమాలో విజయశాంతి నటన అద్భుతం అని చెప్పవచ్చు.ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో ప్రసారమైతే అలాగే అంటిపెట్టుకొని చూసేవారు ఎంతోమంది ఉన్నారు.

అంతేకాకుండా విజయశాంతి తనకు తానే మొదటిసారిగా డబ్బింగ్ చెప్పుకుంది.ఈ సినిమా తర్వాత విజయశాంతిని అందరూ రాములమ్మ అని పిలవడం మొదలుపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube