Prabhas Kriti Sanon: ప్రభాస్ తో పెళ్లి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కృతి సనన్... అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు ఈయన 4 పదుల వయసులోకి అడుగు పెట్టినప్పటికీ ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం నిర్ణయం తీసుకోకపోవడంతో అందరి చూపు ప్రభాస్ పైనే ఉంది.ఇక ప్రభాస్ పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

 Bollywood Actress Kriti Sanon Wants To Marry Prabhas Details, Actress Kriti Sano-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో సార్లు ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి.తాజాగా మరో నటి ప్రభాస్ తో పెళ్ళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో హీరయిన్ గా నటిస్తున్న కృతి సనన్ తాజాగా వరుణ్ ధావన్ హీరోగా నటించిన తోడేలు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.టైగర్ ష్రాఫ్, ప్రభాస్, కార్తీక్ ఆర్యన్ ఈ ముగ్గురు పేర్లు చెప్పి వీరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎవరితో డేట్ కి వెళ్తారు, ఎవరిని ఫ్లర్ట్ చేస్తావు అనే ప్రశ్న ఎదురయింది.

Telugu Actresskriti, Kritisanon, Prabhas, Thodelu-Movie

ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.టైగర్ తో కలిసి డేట్ కి వెళ్తానని చెప్పిన ఈమె కార్తీక్ ఆర్యన్ ను ఫ్లర్ట్ చేస్తానని చెప్పడమే కాకుండా ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా అంటూ సమాధానం చెప్పారు.ఈ విధంగా ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే గతంలో కూడా ఈమె ప్రభాస్ తో ఎంతో చనువుగా ఉండడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా మరోసారి ఈమె ప్రభాస్ పెళ్లి అంటూ కామెంట్స్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube