Siri Hanumanth Bigg Boss 5 : అవును బిగ్ బాస్ 5 లో ఉన్నప్పుడు మిస్టేక్స్ చేశాను కానీ.. సిరి హనుమంత్ ఇంట్రెస్టింగ్ పోస్ట్?

మామూలుగా చాలామంది తమ చేసిన తప్పులు ఒప్పుకోవడానికి అంతగా ఇష్టపడరు.ఎందుకంటే తాము తప్పు చేశామని వాళ్లకు కూడా అనిపిస్తుంది కాబట్టి.

 Yes I Made Mistakes While In Bigg Boss 5 But Siri Hanumanth Interesting Post , I-TeluguStop.com

కానీ కొందరు మాత్రం కొన్ని సందర్భాలలో తాము చేసిన తప్పుల గురించి బయటపెట్టి తమ తప్పు ను ఒప్పుకుంటారు.ఇక తాజాగా గతంలో తను చేసింది తప్పే అంటూ ఒప్పేసుకుంది సిరి హనుమంత్.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సిరి హనుమంత్ బాగా పరిచయం.ఈమె ఒక యాంకర్ గా, నటిగా అంత పరిచయం పెంచుకోలేదు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిందో అప్పుడే తన పరిచయాన్ని పెంచుకుంది.

ఈమె తొలిసారిగా తన కెరీర్ ను యాంకర్ గా మొదలు పెట్టింది.అంతేకాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ లలో కూడా నటించింది.

మొదటిసారి ఉయ్యాల జంపాల సీరియల్ తో తన నటన జీవితాన్ని ప్రారంభించింది.ఆ తర్వాత మోహిని, అగ్నిసాక్షి వంటి పలు సీరియల్స్ లలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.

కేవలం బుల్లితెర పైనే కాకుండా యూట్యూబ్ లలో కూడా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరిస్ లు కూడా చేసింది.

ఇక ఈమె మరో ఆర్టిస్ట్ శ్రీహాన్ తో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

అతడు కూడా యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక వీరిద్దరూ కలిసి చాలా వీడియోస్ చేసి తమకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

ఇక ఈ హోదాతోనే గతంలో సిరి కి ఇప్పుడు శ్రీహాన్ కి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది.

ప్రస్తుతం బిగ్ బాస్ లో శ్రీహాన్ బాగా సందడి చేస్తున్నాడు.

దీంతో మంచి అభిమానం కూడా సంపాదించుకున్నాడు.కానీ సిరి మాత్రం తనకున్న అభిమానాన్ని మొత్తం బిగ్ బాస్ ద్వారా కోల్పోయింది.

ఎందుకనేది.అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.

సిరి హౌస్ లో ఉన్నంతకాలం మరో కంటెస్టెంట్, యూట్యూబర్ షణ్ముఖ్ తో బాగా రెచ్చిపోయింది.

ఫ్రెండ్షిప్ అనే పేరుతో అతడికి హగ్గులు, కిస్ లు ఇచ్చి బాగా రచ్చ చేసి నెగెటివిటీ సంపాదించుకుంది.

దీంతో అందరూ తనపై బాగా ఫైర్ అయ్యారు.అప్పటికే ఆమె శ్రీహన్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఆమె అలా ప్రవర్తించడంతో అందరూ తనని ద్వేషించుకున్నారు.ఇప్పటికీ ఆమె అంటే అంత అభిమానం చూపించలేకపోతున్నారు.

Telugu Bigg Boss, Siri Hanumanth-Movie

అయితే ఇదంతా పక్కన పెడితే ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో శ్రీహన్ ను కలవడానికి సిరి వచ్చిన సంగతి తెలిసిందే.ఇక అందులో ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పాటు ఇంట్లో వాళ్లతో బాగా సందడి చేసింది.అయితే తాజాగా ఇన్ స్టాలో తను ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో జస్ట్ త్రీ మినిట్స్ అనే ఇన్స్టా వాళ్లు సరదాగా బిగ్ బాస్ గురించి క్యూస్షన్స్ అడగమని కాసేపు ముచ్చట్లు పెట్టారు.

దాంతో ఓ నేటిజన్.మీకు ఏ కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ ఎంట్రీ బాగా అనిపించింది బ్రో అని అడగటంతో వెంటనే సిరి హనుమంత్ పేరు చెప్పటంతో పాటు ఆమె ఈ సీజన్లో కంటెస్టెంట్ గా ఉంటే మాత్రం విన్ కూడా అయ్యేది అని కామెంట్ పెట్టాడు.

దీంతో ఆ స్క్రీన్ షాట్ తీసి సిరి తన ఇన్స్టా వేదికగా పంచుకుంటూ.థాంక్యూ సో మచ్ అని.నాకు తెలుసు నేను సీజన్ ఫైవ్ లో ఉన్నప్పుడు నాలో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అని అన్నది.

Telugu Bigg Boss, Siri Hanumanth-Movie

ఇప్పటికీ నా మీద నెగెటివిటీ ఎంత ఉన్నా కూడా నేను మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నన్ను మీ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.ఇది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది లవ్ యు సో మచ్ అంటూ తెలిపింది సిరి.

ఇక ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube