TV Online Order: అవగాహన లేమితో 50 ఇంచ్ టీవీ ఆర్డర్ ఇచ్చాడు.. ఆపై ఆన్‌లైన్‌లో పెట్టిన కామెంట్‌తో గందరగోళం

కొన్ని సార్లు అవగాహన లేమితో చేసే పనులు గందరగోళానికి దారి తీస్తాయి.తెలిసీ తెలియక చేసే వ్యాఖ్యలు అభాసుపాలయ్యేలా చేస్తాయి.

 Buyer Orders 50 Inch Tv Find Its Only 44 Inches Details,  50 Inches Tv, Order, O-TeluguStop.com

ముఖ్యంగా ఆన్‌లైన్‌లో కొందరు చేసే కామెంట్లు నెటిజన్లను తికమకకు గురి చేస్తాయి.తాజాగా అలాంటి ఓ కామెంట్‌కు నెటిజన్లు బాగా ఆకర్షితులవుతున్నారు.

ఇది ఓ టీవీ కొనుగోలు విషయంలో మొదలైంది.దాని సైజ్ ఎంతో తెలియక గందరగోళానికి గురై సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్‌తో గందరగోళం ఏర్పడింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్లు అర్ధరహితంగా ఉంటాయి.

తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందని ఇలా రకరకాల కారణాలతో కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవల వైరల్ అవుతున్న ఓ కామెంట్‌లో ఓ వ్యక్తి తాను సామ్‌సంగ్ కంపెనీకి చెందిన 8 సిరీస్ TU8000 మోడల్ ఆర్డర్ చేశానని తెలిపాడు.

తీరా అది ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ టీవీనీ కొలిస్తే కేవలం 44 ఇంచులు మాత్రమే ఉందని తెలిపాడు.అయితే టీవీని అడ్డంగా కొలవ కూడదని, దాని సైజు తెలుసుకునేందుకు ఏటవాలుగా కొలుస్తారని అతడికి తెలియదు.

ఈ విషయంలో కన్‌ఫ్యూజ్ అయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.సామ్‌సంగ్ కంపెనీ అందరినీ మోసగిస్తోందని, టీవీ సైజు తక్కువ ఉందని కామెంట్ పెట్టాడు.

Telugu Inch Tv, Inches Tv, Tv, Latest, Netizens, Samsung Tv, Trolls-Latest News

ఆశ్చర్యకర విషయం ఏమిటంటే చాలా మంది అతడి కామెంట్‌కు లైకులు కొడుతున్నారు.టీవీ కొలతలను ఏటవాలుగా కొలుస్తారనే విషయం తెలియక, అతడు పెట్టిన కామెంట్‌ నిజమనుకుని జై కొడుతున్నారు.దాదాపు అతడి రివ్యూ కామెంట్‌ను 642 మంది వ్యక్తులు చాలా ఉపయోగకరమైనదిగా భావిస్తున్నారు.కస్టమర్ రివ్యూ ఆ లాజిక్ లేదు.ఆ వ్యక్తి స్క్రీన్‌ను అడ్డంగా కొలిచాడు.ఇక్కడే అతను తప్పుగా భావించాడు.రివ్యూగా అతడు పెట్టిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.48 వేల కంటే ఎక్కువ లైక్‌లు, 2,000 రీట్వీట్‌లు వచ్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube