పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఆయన కమిట్ అయిన సినిమాలను అనుకున్న సమయంలో పూర్తి చేయలేక పోతున్నాడు.ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన హరిహర వీరమల్లు సినిమా మినహా మిగిలిన అన్ని సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ క్యాన్సల్ చేసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇటీవల పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను క్రిష్ తెరకెక్కించాడు.వారం పది రోజుల పాటు పవన్ కళ్యాణ్ వైజాగ్ మరియు ఏపీలో ఇతర ప్రాంతాల్లో పర్యటించాడు.
ఎట్టకేలకు హైదరాబాద్ కి చేరుకొని హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాలని భావించాడు.ఇంతలోనే సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో నిన్న, నేడు జరగాల్సిన షూటింగ్ కార్యక్రమాలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.
దర్శకుడు క్రిష్ సినిమా ను రేపటి నుండి రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన భారీ సెట్టింగ్ లో పునః ప్రారంభించే అవకాశం ఉందంటూ సమాచారం వస్తుంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈ సినిమా లో కీలక పాత్ర లో నటిస్తుందట.భారీ ఎత్తున అంచనాలున్న హరి హర వీరమల్లు సినిమా కు కీరవాణి అందిస్తున్న సంగీతం చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
రికార్డు స్థాయి వసూళ్ల ను ఈ సినిమా నమోదు చేస్తుందనే నమ్మకం తో పవన్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.సమ్మర్ లో ఈ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు.పవన్ కళ్యాణ్ సినిమా లకు తక్కువ రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు అంటూ అభిమానులు అసహనంతో ఉన్న విషయం తెల్సిందే.ఈ సమయంలో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటే ఇలా అయ్యిందేంటి అంటూ క్రిష్ జుట్టు పట్టుకున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.