ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి చాలా కాలం అయ్యింది.ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్న విషయం తెల్సిందే.
టీజర్ విడుదల తర్వాత సినిమా యొక్క విడుదల తేదీ మార్చుతున్నట్లుగా ప్రకటించారు.టీజర్ విడుదల సమయంలో కూడా సినిమా ను సంక్రాంతికి విడుదల చేస్తామని డేట్ తో సహా ప్రకటించిన విషయం తెల్సిందే.
కానీ సంక్రాంతికి ఆదిపురుష్ సినిమా ను విడుదల చేయడం సాధ్యం కాదు అంటూ తేల్చి చెప్పి తాజాగా జూన్ 16వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.దాదాపు అయిదు నెలల ఆలస్యంగా సినిమా ను బాక్సాఫీస్ వద్దకు తీసుకు రాబోతున్నారు.
సినిమా లోని ముఖ్య సన్నివేశాల్లో ఇప్పటికే పూర్తి అయిన గ్రాఫిక్స్ విషయంలో సంతృప్తి వ్యక్తం చేయక పోవడం వల్లే చిత్ర యూనిట్ సభ్యులు మళ్లీ మోషన్ గ్రాఫిక్స్ కు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ యొక్క విడుదల తేదీ అయిదు నెలల పాటు ఆలస్యం అవ్వడం వల్ల చిత్ర నిర్మాత పై దాదాపుగా 150 కోట్ల రూపాయల భారం పడ్డట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే సినిమా బడ్జెట్ పరిమితి దాటి పోయింది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు ఈ భారం మరింత ఎక్కువ అవ్వడం తో నిర్మాతలు ఏం చేయబోతున్నారో అంటూ అంతా చర్చించుకుంటున్నారు.
సినిమా టీజర్ విడుదల తర్వాత సినిమా ను చిన్న పిల్లల సినిమా అంటూ చాలా మంది విమర్శించారు.విడుదల సమయంకు ఆ అభిప్రాయం పోకుంటే మాత్రం కచ్చితంగా నిర్మాతలకు పెద్ద దెబ్బ తప్పక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండు వేల కోట్ల వసూళ్ల ను నమోదు చేస్తుందనే నమ్మకం ను వారు వ్యక్తం చేస్తున్నారట.







