చిరంజీవిని మనవళ్లు, మనవరాళ్లు ఏమని పిలుస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే?

మెగాస్టార్ చిరంజీవి వయస్సు అంతకంతకూ పెరుగుతున్నా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే.వరుస సినిమాలలో నటిస్తున్న చిరంజీవి ఆ సినిమాలతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్లు దక్కేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారు.

 Shocking Facts About Megastar Chiranjeevi Family Details Here Goes Viral, Bhayya-TeluguStop.com

ఈ ఏడాది గాడ్ ఫాదర్ తో సక్సెస్ అందుకున్న చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

“శూన్యం నుండి శిఖ‌రాగ్రం వ‌ర‌కూ” అనే పుస్తకావిష్కరణ కోసం హాజరైన చిరంజీవి తన కుటుంబానికి సంబంధించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

నా మనవళ్లు, మనవరాళ్లు చరణ్, వైష్ణవ్, సాయితేజ్ పాటలు, సినిమాలు వేయమని అడుగుతారని నా సినిమాలను, నా పాటలను పట్టించుకోరని అందువల్ల నాలో జెలసీ ఫీలింగ్ పుట్టుకొస్తోందని ఆయన కామెంట్ చేశారు.

మనవళ్లు, మనవరాళ్లను కూర్చోబెట్టుకుని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

లాక్ డౌన్ సమయంలో మనవళ్లు, మనవరాళ్లకు నా సినిమాలను, పాటలను చూపించానని నా మనవళ్లు, మనవరాళ్లు నన్ను భయ్యా అని పిలుస్తారని చిరంజీవి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.అయితే నా మనవళ్లు, మనవరాళ్లకు గాడ్ ఫాదర్ మూవీ మాత్రం నచ్చిందని చిరంజీవి అన్నారు.

Telugu Bhayya, Chiranjeevi, Grand, Tollywood-Movie

తెలుగు సినీ మీడియా ఆరోగ్యవంతంగా ఉందని చిరంజీవి తెలిపారు.తమిళంలోని ఒక పత్రికలో అభూత కల్పనలు ప్రచారంలోకి వచ్చేవని తెలుగులో అలాంటి పరిస్థితి లేదని చిరంజీవి కామెంట్లు చేశారు.కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చినా వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదని చిరంజీవి వెల్లడించారు.మరోవైపు చిరంజీవి, రవితేజ హీరోలుగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక కథ వైరల్ అవుతోంది.

వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube