అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.కొమురం భీం గా ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను కట్టి పడేసింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో తిరుగులేని స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.ఇక ఇటీవలే ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేసారు.
దీంతో ప్రొమోషన్స్ ప్లస్ వెకేషన్ గా భార్యతో కలిసి జపాన్ ను చుట్టి వచ్చిన ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇదే జోష్ లో నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.
ఎన్టీఆర్ 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించాడు.ఈ సినిమా ప్రకటించి చాలా నెలలు అవుతున్న ఇప్పటికి సెట్స్ మీదకు వెళ్లనే లేదు.
రోజురోజుకూ లేట్ అవుతూ రావడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఈ సినిమా నుండి ఎప్పుడు అప్డేట్ వస్తుందా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది అని చెబుతారా అని వేచి చేస్తున్నారు.
మరి తాజాగా ఈ షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.అందుతున్న సమాచారం ప్రకారం.త్వరలోనే తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట.తాజాగా ఎన్టీఆర్ జపాన్ నుండి తిరిగి ఇండియాకు వచ్చాడు.
ఈ క్రమంలోనే కొద్దీ రోజులుగా ఆలస్యం అవుతూ వస్తున్న ఈ సినిమాపై ద్రుష్టి పెట్టారట.
త్వరలోనే కొరటాల ఫైనల్ డ్రాఫ్ట్ ని వినిపించ నున్నారట.ఇక ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే నవంబర్ లో ముహూర్తం చూసుకుని స్టార్ట్ చేయనున్నారట.అయితే రెగ్యురల్ షూట్ మాత్రం డిసెంబర్ నుండి స్టార్ట్ చేసి ఆగకుండా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు టాక్.
ఈ ప్రాజెక్ట్ లాంచ్ డేట్ ను ఎన్టీఆర్ త్వరలోనే ఫైనల్ చేయనున్నారట.ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.