మృగాల నుంచి పసిదాన్ని ఎలా కాపాడుకోవాలి..?

ఇంటి చుట్టూ నటించే నక్కలు.చాన్స్ కోసం ఎదురు చూసే వేటగాల్లు.

 How To Keep Children Safe Rapes Molestations,children,women,molestations, Societ-TeluguStop.com

చంటి పాపైనా.పండు ముసలి అయినా లేదు వాళ్లకి తేడా.

అభం శుభం తెలియని పసిపిల్లకు రక్షణ ఏది.చెప్తే అర్తం చేసుకొనే వయసు కాదు వారిది.ఎలా వారికి రక్షణ ఎలా.వారి జీవితాలకి తోడు ఎవరు.నీడాలా ఎవరుండాలి.సమాజం నుంచి వారిని కాపాడేది ఎవరు.? తల్లిదండ్రి ఎలాంటి పాత్ర పోషించాలి.మొగ మృగాల మద్య నలిగిపోకుండా కాపాడుకునేది ఎలా.? బాగా తెలిసిన డ్రైవర్‌ ‘అంకులే’… రోజూ ముద్దుచేసే ‘బాబాయే’! సుద్ధులు నేర్పే ‘గురువే’… అంతా తెలిసినవాళ్లు, అయినవాళ్లు కాబట్టే ‘పాపాయి చెప్పిన కష్టాన్ని’ పట్టించుకోం.‘ఇలాగని ఎవ్వరితోనూ చెప్పకు’ అంటూ నోరూ నొక్కేస్తాం.

పెద్దల ఈ తీరు.పసిహృదయాల భవిష్యత్తుని గాయపరచకుండా ఉండాలంటే.

మన బాధ్యత ఏంటో తెలుసుకుందాం.
బంజారాహిల్స్ లో.ఓ స్కూల్‌ బస్సు డ్రైవరు, ప్రిన్సిపాల్ నాలుగేళ్ల చిన్నారిపై కర్కశంగా, అనుచితంగా ప్రవర్తించారు.మధ్యప్రదేశ్‌, హరియాణా, నోయిడా, తాజాగా హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనల గురించే విన్నాం.

ఇంట్లో తండ్రి,బల్లో టీచర్‌, చుట్టాల ఇంట్లో బాబాయి, పండు ముసలి తాతయ్య ఇలా ఎవరైనా పసి దాని మీద చేయి వేయవచ్చు… కోకొల్లాగు.పుట్టాల్ల వచ్చపే ఈ వార్తలు వింటే గుండె జల్లు మంటుంది.

అయ్యో ఆడదానికి కాదు పసిపిల్లకు కూడా ప్రమాదమే ఈ భూమి పై అనిపిస్తుంది.ఒక్క సారి ఆ స్థానంలో నా బిడ్డ ఉంటే అని ఆలోచిస్తేనే గుండె పేలిపోతుంది.

ఎంతలా ఆర్తనాదాలు చేసి ఉంటుంది.దిక్కులు పెక్కటిల్లేలా అమ్మా అని అరిచి ఉంటుంది.

నాన్న నువ్వుఎక్కడా అని కల్లల్లో కారే కన్నీరు సమాధానం చెప్పలేక పోయి ఉంటుంది.ఇలాంటి ఘటన మనింట్లో జరిగితే.

కాదు జరగకుండా ఉంటుంది అని మనం చెప్పగలమా.ఏమో ఆ మృగం ఎక్కడ ఉందో.

ఇంట్లో కాపుకాచిందో.వాకిట్లో తిష్ట వేసిందో.

ఎవరికి తెలుసు ఏ మనుసులో ఎంత చెడు దాగి ఉందో.ఆలోచనలు నిండి ఉన్నాయో…ఎందుకంటే.దేశవ్యాప్తంగా ఏటా వేలమంది పసికందులు ఇలాంటి పైశాచికాలకే బలైపోతున్నారని నేషనల్‌ క్రైం రికార్డ్సు బ్యూరో సమాచారం చెబుతోంది.2020లో నమోదైన పోస్కో కేసులే 47వేల221 కాగా, కోర్టుల్లో ఇప్పటివరకూ ట్రయల్‌ కోసం ఎదురు చూస్తున్నవి ఒక లక్ష70వేల271 కేసులు.

ఇలాంటి వేధింపులు తెలిసిన వాల్ల దగ్గర రోజు మన చుట్టూ చేరి ఉన్న వాళ్ల దగ్గరి నుంచి ఎదురు అవుతున్నాయి.పిల్లలు చెబితే.‘ఛ ఊరుకో’ అని కొట్టిపారేస్తాం.‘ఇంకెవరికీ చెప్పొద్దు.పరువు పోతుందంటాం’. పరువు ముఖ్యమా.

పసిదాని ప్రానం మానం ముఖ్యమా.?అసలు అలా చెప్పడం ఎంత వరకు కరెక్ట్.రెండూ తప్పని నేనంటాను.చిన్నపిల్లలు నాకిలా జరుగుతోందన్నారంటే ఆలోచించాలి.జరిగిక ముందే వారికి అర్థం అయ్యేలా తెలియజేయాలి.నీకు మేమున్నాం అన్న భరోసానివ్వాలి.

ఆ వాతావరణం నుంచి వాళ్లని దూరం చేసే మార్గాలు వెతకాలి.ఇది అమ్మానాన్నల మొదటి బాధ్యత.

పసిపిల్లలు నోరుతెరిచి తమపై జరుగుతున్న అఘాయిత్యం గురించి చెప్పలేరు.ఆ బాధ్యతని తల్లిదండ్రులుగా మనమే తీసుకోవాలి.

చిన్నారుల హావభావాలు, ప్రవర్తనలో చిన్న తేడా కనిపించినా వెంటనే ఆరా తీయాలి.

చిన్నది ఒంటిరిగా ఉంటుందా.

ఎప్పుడు ఇల్లంతా పట్టీల సప్పుడుతో అల్లరి చేసే పిల్ల ఎందుకు భయపడుతూ కుర్చుంటింది అని ఆలోచించాలి.ఆరా తీయాలి.

అంతే కానీ ఏం కాదులే అని అని సరిపెట్టుకోవద్దు.అలా ఉంటున్నారు అంటే వాళ్లకి ఏదో జరిగే ఉంటుంది అని అనుకోవాలి.

ఎవరికి చెప్పాలి.ఇది అని ఎలా చెప్పాలి అసలు దాని పేరు ఏంటి.

పలానా వ్యక్తి ఏం చేశాడు అని చెప్పాలి.చెబితే అమ్మ తిడుతుందేమో.

నాన్న కొడుతాడేమో.పెన్సిల్ పోయింది అంటే తిట్టే అమ్మ ఇది చెప్తే చంపేస్తుందేమో వంటి అనుమానాలు, భయాలతో పిల్లలు నోరు విప్పరు.

మనసులోని బాధని ఎవరితోనూ పంచుకోలేక లోలోపల కుమిలి పోతుంటారు.దీనికి పరిష్కారం ఒక్కటే! ఇంట్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు పిల్లల్లో ధైర్యం నింపాలి.

మా చుట్టు పక్కన వారంతా మంచొల్లే.అలాంటి వారు మా పక్కన లేరు లే అని గుండెల మీద చేయి వేసుకొని పడుకోవద్దు.ఎందుకంటే మనకు బాగా తెలిసిన ఆటోల్లో రాక్షసులు రాజ్యమేలవచ్చు.జరిగినా చాలా ఘటనల్లో తెలిసిన వారు చేసినవే ఎక్కువ.తల్లిదండ్రుల అప్రమత్తతే దీనికి పరిష్కారం.అలాగే పిల్లలకు కూడా ఈ విషయంలో చెడుని గుర్తించే శిక్షణ అవసరం.

తమకి నచ్చని విషయాన్ని గుర్తించి.ఎదిరించే ధైర్యాన్ని చిన్నారుల్లో నింపాలి.

లైంగిక వేధింపులకు గురైనా పిల్లల్లో ఎలా వివరించాలో చెప్పే బెరుకు ఉండవచ్చు.చెప్పలేని స్థితి వారికి రావచ్చు.కడుపులో నొప్పని చెప్పినా పలానా చోట ఇబ్బంది అని చెప్పినా దాని తీవ్రతను బట్టి సమస్యను అర్థం చేసుకోవాలి ఆరా తీయాలి.మన వద్ద ఉన్న మందులు వేసినా ఫలితం లేదు అంటే.

వేధింపుల దిశగా ఆలోచించాలి.కొత్తవాళ్లను చూసి భయపడటం, ఎవరితోనూ కలవలేకపోవడం, మౌనంగా ఉండిపోవడం వంటివి చేస్తుంటారు.

కొందరిలో వణుకు వస్తుంది.ఫిట్స్‌ వస్తాయి.

కొన్ని అవయవాలు పనిచేయవు.అందరిలోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయని కాదు.

డిప్రెషన్‌, ఆందోళన, ఫోబియా, తిన్నదేదీ సహించకపోవడం. వంటివీ జరగొచ్చు.

కాస్త పెద్దపిల్లలయితే ఒంటిని గాయపరచుకోవడం వంటివి చేస్తుంటారు.మనసులోని వేదనని ఇలా వ్యక్తపరుస్తుంటారు.

అమ్మానాన్న ఎంత ధైర్యమిచ్చినా చిన్నారులకి ఇదో పెద్ద సంక్షోభం.త్వరగా బయటపడలేరు.

కాబట్టి, నిపుణుల సాయం తప్పనిసరిగా తీసుకోవాలి.వయసు, తీవ్రత బట్టి వాళ్లు చికిత్సను సూచిస్తారు.

దీన్నుంచి వెంటనే బయటపడతారని చెప్పలేం.సమయం పడుతుంది.

పిల్లలకు ఇలా జరిగినప్పుడు తల్లిదండ్రుల్లోనూ బాధ ఉంటుంది.అయితే దాన్ని వాళ్ల ముందు ప్రదర్శించకూడదు.

తమ వల్లే ఇలా జరిగిందంటూ కుంగిపోయే అవకాశముంది.అందుకే పిల్లల ముందు ధైర్యంగానే ఉండాలి.

అభంశుభం తెలియని పసివారిని కాపాడుకోవాల్సిన బాద్యత మనదే.

How To Protect Our Children From Molestations

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube