ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇకపోతే ఈ సినిమా ఇండియాలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా ఆస్కార్ బరిలో పెట్టడం కోసం రాజమౌళి కూడా ఎంతగానో కృషి చేస్తున్నారు.
ఇక ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంది.
ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ.ఆర్ఆర్ఆర్ సినిమాని వెంకటేష్ శ్రీకాంత్ నటించిన సంక్రాంతి సినిమాతో పోల్చారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర 100% ఉంటే ఎన్టీఆర్ పాత్ర మాత్రం 20 శాతం మాత్రమే ఉందని ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.సంక్రాంతి సినిమాలో వెంకటేష్ నటించిన విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్ నటించారు.
సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ నటించిన విధంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ నటించారని వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా వేణు స్వామి వ్యాఖ్యలతో మరోసారి రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు కూడా మొదలయ్యాయని చెప్పాలి.ఈ సినిమా విడుదలైన సమయంలోనే ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు.సినిమాలో ఎక్కువ భాగం రామ్ చరణ్ కి ప్రాధాన్యత కల్పించారని, తారక్ పాత్రను చాలా తక్కువ చేసి చూపించారంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే మరోసారి ఇదే విషయంపై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు.