అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబుతో ఫస్ట్ ఎపిసోడ్ బాలకృష్ణ చేయటం తెలిసిందే.అయితే ఈ షోకి సంబంధించి ప్రోమో ఇటీవల రిలీజ్ అయింది.
ప్రోమోలో చంద్రబాబు చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.అయితే ఈ షో పై కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తండ్రి చావుకు కారణమైన చంద్రబాబుతో బాలకృష్ణ షోలో పాల్గొనటం సిగ్గుచేటు అంటూ విమర్శించారు.దీంతో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
బాలకృష్ణ కాలిగోటికి కూడా కొడాలి నాని సరిపోడు అని అన్నారు.
సిగ్గు లజ్జ లేకుండా బాలకృష్ణ గురించి మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు అప్పట్లో లక్ష్మీపార్వతి ఏం చేసిందో పార్టీ నాయకులకు ఇంకా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు తెలుసని అన్నారు.నందమూరి హరికృష్ణ పేరు చెప్పుకొని కొడాలి నాని అనేక లక్షలు దోచుకున్నారని ఆరోపించారు.
అయితే ఏ అర్హతతో ఎన్టీఆర్ కుటుంబం గురించి కొడాలి నాని మాట్లాడుతున్నారని రావి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.అంతేకాదు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి నానికి కూడా వాటా ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
రాబోయే రోజుల్లో గుడివాడ ప్రజలు కొడాలి నానికి గట్టిగా బుద్ధి చెబుతారని .రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.