ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి చాలెంజ్ విసిరారు.రూ.18 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.కేంద్రం ఇలా చేస్తే ఉపఎన్నిక బరి నుంచి తప్పుకుంటామని ఆయన సవాల్ విసిరారు.పార్టీ మారినందుకే రాజగోపాల్ రెడ్డికి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించిన జగదీష్ రెడ్డి.ఒక వ్యక్తి కోసం రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు.







