ఫస్ట్ డే తడబడినా మళ్ళీ పుంజుకున్న గాడ్ ఫాదర్.. 2వ రోజు స్ట్రాంగ్ వసూళ్లు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని చిరుతో పాటు మెగా ఫ్యాన్స్ కు ఆతృతగా ఎదురు చూసారు.

 Godfather Box Office Collection Day 2, Satyadev, Megastar Chiranjeevi, God Fathe-TeluguStop.com

మరి అందరి ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ నిన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మొదటి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ కనిపించారు.తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు, కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.

సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు.

అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమా మొదటి రోజు ఎలా ఉన్న రెండవ రోజు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బాస్ తన ర్యాంపేజ్ చూపించారు.మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 38 కోట్ల రాబట్టింది.

ఇక రెండవ రోజు కొద్దిగా కలెక్షన్స్ డ్రాప్ అయినా 31 కోట్ల సాలిడ్ గ్రాస్ అందుకుని టాప్ లో నిలిచింది.మరి ఈ వీకెండ్ గడిస్తే మరింత వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు సైతం చెబుతున్నాయి.

మరి మొదటి రోజు ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి.ఇక రెండవ రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో మెగా ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు.మొత్తానికి బాస్ ఈజ్ బ్యాక్ అనేలా చిరు తన స్టామినా చూపించి ఆచార్య ప్లాప్ ను మరిపిస్తున్నాడు.మరి ఈ వీకెండ్ ఎంత వసూలు రాబడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube