వైరల్: గిన్నిస్ రికార్డ్ కోసం నిమిషం వ్యవధిలో అమాంతం కోడికాళ్లను మింగేసిన యువతి!

మనలో కొంతమంది చాలా ప్రత్యేకంగా వుంటారు.ప్రత్యేకంగా ఉండటమే కాదు, చాలా ప్రత్యేకమైన చర్యల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు కావాలని తహతహలాడుతూ వుంటారు.

 A Young Woman Who Swallowed A Lot Of Chickens In A Minute For The Guinness Reco-TeluguStop.com

అలాంటివారు ఎలాంటి ఛాలెంజ్ చేయడానికైనా వెనుకాడరు.అలాంటిది గిన్నిస్ రికార్డు అంటే ఊరుకుంటారా? అందలాన్నైనా వంచేయాలని చూస్తూ వుంటారు.తాజాగా అలాంటి ఓ సంఘటనతో ఓ యువతి గిన్నిస్ రికార్డులకెక్కింది.

మీరు సాధారణంగా చికెన్‌ తినే పోటీ గురించి విని వుంటారు.

కోడిని మొత్తం లాగించే వారిని కూడా మీరు చూసి ఉంటారు.కానీ కేవలం చికెన్‌ కాళ్లు తినే పోటీని మీరెప్పుడైనా చూశారా? ఉడకబెట్టిన కోడి కాళ్లను.అది కూడా కేవలం ఒకే ఒక్క నిమిషం వ్యవధిలో తినే పోటీ గురించి మీరు విని వుండరు.ఎందుకంటే ఎముకలతో కూడిన కోడి కాళ్లను తినడం అంటే మామూలు విషయం కాదు.

వాటిని కాల్చిన పద్ధతిని బట్టి రుచి మారుతుంది.అలాంటిది దక్షిణాఫ్రికాకు చెందిన వుయోల్వెతు సిమనైల్‌ అనే యువతి కేవలం 60సెకన్లలో ఏకంగా మూడున్నర కోడికాళ్ల (121 గ్రాముల బరువైన)ను గుటుక్కుమనిపించేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నెల కొల్పింది.

అవును, డర్బన్‌లోని ఉమ్లాజీలో ఉన్న మాషమ్‌ప్లేన్స్‌ లాంజ్‌ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌లో ఇటీవల జరిగిన ఈ పోటీలో ఆమె ఈ ఘనత సాధించింది.పోటీలో పాల్గొన్న ఐదుగురిలో ఒక యువతి కోడి కాలును నోట్లో పెట్టుకోగానే కడుపులో తిప్పడంతో అక్కడ్నుంచి లేచి వెళ్లిపోగా సిమనైల్‌ మాత్రం ఎటువంటి ఇబ్బంది పడకుండా వాటిని అమాంతం ఆరగించేసింది.కాగా ఈ పోటీ స్టంబో రికార్డ్‌ బ్రేకర్స్‌ అనే చానల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube