పాపం అర్జున్.. శ్రీహన్ తో రొమాన్స్ చేస్తున్న శ్రీసత్య.. ఆ సీన్ చూస్తే కామెడీనే?

బిగ్ బాస హౌస్ లో తాజాగా 5 వ వారంకీ సంబంధించిన నామినేషన్స్ మొదలైన విషయం తెలిసిందే.అయితే మీ నామినేషన్స్ లో అర్జున్,శ్రీ సత్య జంటగా నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనగా చివరికి సత్య పై చేయిగా నిలిచింది.

 Srihaan Romance With Sri Satya , Srihan, Bigg Boss Season 6, Romance, Sr Sathya,-TeluguStop.com

ఇకపోతే గతవారం సత్య కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టి రెండోసారి కూడా జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.తాజాగా నామినేషన్స్ లో కూడా శ్రీ సత్య అర్జున్ మాటలను కొట్టి పారేసినట్టుగా మాట్లాడినా కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు.

అయితే గత వారం నాకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి నిరూపించుకుంటా అన్న అర్జున్ కల్యాణ్‌ ఈవారం శ్రీ సత్య కోసం మరోసారి త్యాగం చేసి నామినేషన్‌లో కూర్చున్నాడు.

మొత్తానికి శ్రీ సత్య నీ అన్ని విషయాలలో గెలిపిస్తూ తాను ఓడిపోతూ వస్తున్నాడు అర్జున్.

కానీ శ్రీ సత్య మాత్రం అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతూనే వస్తోంది.ఇదిలా ఉండగా తాజా ప్రోమోను విడుదల చేశారు బిగ్‌బాస్‌.

బిగ్‌ బాస్‌ బర్త్‌డే కావడంతో హౌస్‌ లోని కంటెస్టెంట్ లను ఎంటర్‌టైన్‌ చేయమని బిగ్‌బాస్‌ కోరతాడు.అయితే ఇక్కడ శ్రీ సత్యకు డాన్స్‌ చేయాలని ఆదేశించారు.

అయితే పక్కన పెయిర్‌ మాత్రం అర్జున్‌ కాకుండా,శ్రీహాన్‌కి ఆ అవకాశం దక్కింది.

అప్పుడు శ్రీహన్, శ్రీ సత్య ఇద్దరూ కలిసి ఓ సీతా..అనే రొమాంటిక్‌ స్టెప్పులేశారు.ఇక డాన్స్ చేస్తూ మధ్యలో రెచ్చిపోయాడు శ్రీ హాన్.శ్రీ సత్య ను అమాంతం పైకి ఎత్తేశాడు.ఇక శ్రీ సత్య కూడా ఫుల్ ఎంకరేజ్ చేయడంతో ఇద్దరు కలిసి రొమాంటిక్ గా డాన్స్ వేశారు.వారి డాన్స్ చూస్తూ అర్జున్ చాలా ఫీల్ అయిపోయినట్లు తెలుస్తోంది.

తాజా ప్రోమో నీ పట్టి చూస్తే అర్జున్ తన బాధను కంట్రోల్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube