సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి..

సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల స్థలాల హామీని అమలు చేయాలని టియుడబ్ల్యూ ఐజేయు రాష్ర్ట ఉపాధ్యక్షులు కె.రాంనారయణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు రవీంద్ర శేషు డిమాండ్ చేశారు.

 Cm Kcr Promise To Journalists Should Be Implemented Tuwj Iju, Cm Kcr , Journalis-TeluguStop.com

ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఆదివారం ఖమ్మం జిల్లా ఎలక్ర్టానిక్ మీడియా జిల్లా కార్యవర్గ సమావేశం ఆవుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో రాంనారాయణ, రవీంద్ర శేషు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట సాధనలో జర్నలిస్టులు ముఖ్యభూమిక పోషించారు , సుదీర్ఘకాలంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్య కూడా పరిష్కారం అయ్యిందని, ప్రభుత్వం వెంటనే జీవో ఇచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.

టియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన అనేక ఆందోళన, పోరాటాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు.ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం పోరాటాలను ఉధ్నతం చేస్తామని హెచ్చరించారు.

ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు పెరుగుతున్నాయని అవేధన వ్యక్తం చేశారు.జర్నలిస్టుల పై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం దాడుల నివారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

వ్నత్తిలో ఒత్తడి పెరిగి ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రభుత్వం హెల్త్ కార్డులను మంజూరు చేసి కార్పోరేట్ హాస్పటల్ లో ఉచిత వైద్యం చేయాలన్నారు.రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన దళిత, గిరిజన బంధు ను ఆయా సామాజిక వర్గాలకు చెందిన జర్నలిస్టులకు వర్తింపచేయాలన్నారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉన్న జర్నలిస్టులకు అనేక సమస్యలున్నాయని, ఆసమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు క్నషీ చేయాలని కోరారు.పలువురు జర్నలిస్టులకు సన్మానం….

జర్నలిస్ట్ వ్నత్తిలో సుదీర్ఘ కాలం పాటు పని చేస్తున్న సీనియర్ నాయకులు కె.రాం నారాయణ, రవీంద్ర శేషు, శివకు టియుడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీ ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు.వారు పత్రిక రంగంలో చేసిన సేవలను పలువురు నేతలు కొనియాడారు.

ఎందరో జర్నలిస్టులను తయారు చేశారు అని, వారి వ్నత్తిపట్ల నిబద్దత, నిజాయితీ అందరికి ఆదర్శ ప్రాయం అని కోనియాడారు.

ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎలక్ర్టానిక్ మీడియా రాష్ర్ట నాయకులు నర్వనేని వెంకట్రావు, గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కనకం సైదులు, టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ర్ట నాయకులు మాటేటి వేణుగోపాల్, నగర అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాసరావు, వేగినాటి మాధవరావు, ఎలక్ర్టానిక్ మీడియా జిల్లా నాయకులు భూపాల్, రమేష్, వాసు, నారాయణ, రామక్నష్ణ, మహేందర్, నవీన్, రాజేంద్ర ప్రసాద్, అయ్యప్ప, గోవింద్ నాయకులు వెంకట్రావు, మోహిన్ ద్దున్,నామా పురుషోత్తం, శ్రీనివాసరావు, సిహెచ్ విజయ్, జకీర్, రాంబాబు, కిరణ్, శ్రీనివాసరావు, శ్రీధర్ తదితరలు పాల్గోన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube