అక్కడొక మృత్యుబావి వుంది, కానీ అందులో మృతదేహాలు కుళ్ళవు?

అక్కడొక పెద్ద బావి వుంది, అందులో పడినవారు ఇంకా బయటికి రారు.వారిని దెయ్యాలు పీక్కు తింటాయి.

 Scientists Found Pool Of Death Kills Anything That Swims In It Details,  Sea,dea-TeluguStop.com

లేదంటే వారు మాయమైపోతుంటారు… బేసిగ్గా ఇలాంటి విషయాలు సినిమాలలో తప్ప బయట మనకి కనబడవు.ఇలాంటిదే ఇప్పుడు చెప్పుకుబోయే స్టోరీ కూడా.

అయితే ఇది నిజమైన స్టోరీ.ఈ కొలనులో ఈతకు కెళ్లిన వారెవ్వరూ ఇంత వరకు బతికి బట్టకట్టలేదట.

అందుకని దీనిని ‘పూల్ ఆఫ్ డెత్’ అని పిలుస్తారు.ఎర్ర సముద్రం గురించి మీకు తెలిసే ఉంటుంది.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఉప్పగా ఉండే సముద్రం అని కూడా అంటారు.

మియామీ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టుల బృందం ఈ సముద్రంలో దాదాపు 1,770 మీటర్ల లోతులో ‘పూల్ ఆఫ్ డెత్’ గుర్తించారు.

ఈ కొలనులోకి ప్రవేశించిన ఏ జీవి కూడా ఇప్పటి వరకు సజీవంగా తిరిగి రాలేదట.ఈ మృత్యు కొలను సౌదీ అరేబియా తీరానికి 5,800 అడుగుల దూరంలో ఉంది.

అలాగే దాని పరిసర ప్రాంతం కూడా చాలా ఘోరంగా ఉంటుందని వారి తెలిపారు.అక్కడికి వెళ్లే ఏ జీవి కూడా బతకదని శాస్త్రవేత్తలు సైతం వెల్లడించారు.ముఖ్యంగా ఈ కొలనులో నీరు తాగినా మృత్యువు తప్పదు.ఈ కొలనులోని నీరు చాలా ప్రమాదకరమైనది.

దీనిపైన అనేక గాసిప్స్ బయట వినబడుతూ ఉంటాయి.ఓ పరిశోధన ప్రకారం, ఈ కొలనులో ఆక్సిజన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది.హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ఇతర విష రసాయనాలు కూడా ఈ నీటిలో ఉన్నాయి.అంతేకాకుండా ఈ కొలను నీటిలో సాధారణ సముద్రం నీటి కంటే 7-8 రెట్లు ఉప్పు అధికంగా ఉందని, అందువల్లనే ఏ జీవి దానిలోకి వెళ్లినా చనిపోతుందని తేలింది.

అయితే ఈ కొలనులో చనిపోయిన ఏ జీవి అయినా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది.ఎందుకంటే.ఇక్కడి నీరు ఉప్పగా ఉండటం వల్ల ప్రిజర్వేటివ్‌లుగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube