5జీ సేవల లిస్ట్‌లో లేని ఏపీ నగారాలు.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు!

ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ అంటే టెక్నాలజీకి అడ్డగా ఉండేది.ఇన్నోవేటివ్ టెక్నాలజీతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలేచేది.

 5g Network To Be Available In 20 25 Cities Ap Not In List Details, 5g,5g Rollout-TeluguStop.com

ఏ కొత్త టెక్నాలజీ విడుదలైన దానిని ప్రజలకు అందించడంలోనూ ఏపీ ముందుండేది.కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వాలు మారి ప్రయారిటీలు మారిపోయాయి.

ప్రస్తుతం రెండు రాష్ట్రాల అభివృద్ధిలో చాలా తేడా కనిపిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితిలు ఆ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి.

తాజాగా విడుదలైన 5g సేవల జాబితాలో విశాఖ, విజయవాడ కంటే చిన్న నగరాలకు చోటు దక్కింది.ఏపీ నుండి ఒక్క నగరం కూడా ఎంపిక కాకపోవడం ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం పడుతుంది.

దేశంలోని పెద్ద రాష్ట్రాల్లోన్ని చాలా నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా 5జి సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ద్వీతియ నగరాలైన జామ్‌నగర్.లక్నో వంటి ప్రాంతాల్లో కూడా 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి.కానీ ఏపీలోని ఏ నగరానికి కూడా 5జీ సేవల జాబితాలో చోటు దక్కపోవడంపై ప్రజలు అసహానం వ్యక్తం చేస్తున్నారు.దీనికి కారణం ప్రభుత్వం నుండి చొరవ లేకపోవడం వల్ల ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం 5జీ సేవలు అందిస్తున్న నగరాలు కేవలం రాజధానులే కాకుండా.ద్వీతియ శ్రేణి నగరాలు కూడా ఉన్నాయి.

వాటి కంటే ఏపీలో విజయవాడ, విశాఖ పెద్ద నగరాలు.కానీ 5జీ సేవలు ప్రారంభించాల్సిన నగరాల జాబితాలో వీటికి చోటు దక్కలేదు.

విశాఖ కంటే అభివృద్ది పరంగా, జనాభ పరంగా వెనుకబడ్డ నగరాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.విశాఖ ఏపీలో పెద్ద నగరం విజయవాడ నాస్కామ్‌ ప్రకారం మొబైల్‌ డేటా వినియోగంలో విజయవాడ దేశంలో 12వ స్థానంలో ఉంది.కానీ 5జీ సేవలు అందించడానికి మెుబైల్ కంపెనీలు మెుగ్గు చూపలేదు.సర్కారు చొరవ తీసుకుంటే ఏపీలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చేదని ప్రజలు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube