గేమర్స్ కి శుభవార్త... ఇండియాలో 5Gతో మొబైల్ గేమింగ్ కొత్త పుంతలు!

ఇంటర్నెట్ వినియోగం బాగా పెరగడంతో గత కొన్నేళ్లుగా ఇండియాలో మొబైల్ గేమింగ్ పాపులారిటీ చాలా వేగంగా విస్తరించింది.ఈ రోజుల్లో రూ.15-20వేల నుంచి లభించే స్మార్ట్‌ఫోన్లు మోస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్లతో అందుబాటులోకి వస్తున్నాయి.వీటితో పబ్జీ వంటి హైఎండ్ గేమ్స్ ఆడటం సాధ్యమవుతోంది.

 గేమర్స్ కి శుభవార్త… ఇండియా-TeluguStop.com

అందుకే నేడు చాలామంది మొబైల్ గేమింగ్‌ని దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ మొబైల్స్ కొంటున్నారు.అందువలనే మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ ఇక్కడ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ఈ క్రమంలో 5G Technology ఇంటర్నెట్ ఇక్కడ పూర్తిగా అందుబాటులోకి వస్తోంది అనే న్యూస్ రాగానే యువత పండగ చేసుకుంటోంది.అవును, మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఇక్కడ కనబడుతోంది.

ఇండియా దాదాపు 500 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లతో, చైనా తర్వాత ప్రపంచంలో అత్యధిక స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉన్న దేశంగా నిలుస్తోంది.ఇంతమంది యూజర్లు 43 కోట్లకు పైగా మొబైల్ గేమర్స్‌ ఉన్నారు.

ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లేటెస్ట్ డేటా ప్రకారం, 2025 నాటికి వారి సంఖ్య 65 కోట్లకు పెరుగుతుందని అంచనా.

Telugu Games, Launched, Cloud, India, Ups-Latest News - Telugu

కరోనా సమయంలో ఇండియాలో మొబైల్ యాప్ డౌన్‌లోడ్స్‌ 50% పెరగగా, యూజర్ ఎంగేజ్‌మెంట్ 20 శాతం పెరిగింది.దాంతో ఈ రంగంలో వృద్ధి అనేది చాలా వేగంగా జరిగినట్లు IAMAI నివేదిక వివరించింది.అలాగే ఇండియాలోని గేమింగ్ ఇండస్ట్రీలో అవకాశాలు అపారంగా ఉన్నాయి.5G నెట్‌వర్క్‌ను లాంచ్ చేస్తే భారతదేశంలో మొబైల్ గేమింగ్ రంగానికి మరింత సపోర్ట్ అందించినట్లు అవుతుందని నిపుణులు అంటున్నారు.భారతదేశంలో 5G రాకతో హై డేటా స్పీడ్, లో లేటెన్సీ, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి వాటితో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత పెరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube