పిల్లులకు పాలిస్తున్న కుక్క.. అసలు స్టోరీ తెలిస్తే ఫిదా అవుతారు..

సోషల్ మీడియాలో వైరల్ కొన్ని యానిమల్ వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.అయితే కొన్నిటి వెనుక ఉండే స్టోరీల గురించి తెలుసుకుంటే ఎమోషనల్ అవ్వక తప్పదు.

 Mother Dog Feeds Milk To Kittens Viral Video,dog,cats,kittens,viral News, Viral-TeluguStop.com

తాజాగా అలాంటి ఒక స్టోరీ ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.దీన్ని చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు.
కారు ఢీకొనడంతో ఈ తల్లి కుక్క తన బిడ్డలందరినీ కోల్పోయింది.అదే విధంగా కొన్ని పిల్లి పిల్లలు తల్లిని కోల్పోయాయి.అయితే ఇవి రెండు కూడా ఒకదానికొకటి కలిసిపోయాయి.ఆ విధంగా పిల్లలు లేని తల్లికి పిల్లి పిల్లలు.

తల్లి లేని పిల్లి పిల్లలకు తల్లి దొరికింది.ఈ కుక్క తన పిల్లలను కోల్పోయినందుకు ఎంతో బాధపడుతూ దుఃఖంలో మునిగితేలుతోంది.

అయితే పిల్లి పిల్లలు అనాథలుగా కనిపించగానే అది క్షీణించిపోయింది.వాటిని తన పిల్లలుగా భావించి వాటికి పాలు ఇస్తోంది.

వాటిని రోజూ ముద్దాడుతూ తన సొంత బిడ్డలలాగే చూసుకుంటుంది.

వైరల్ అవుతున్న వీడియోలో పిల్లి పిల్లలకు తల్లి కుక్క పాలు ఇవ్వడం చూడవచ్చు.దీని ముఖంలో చాలా బాధ కూడా కనిపించింది.ఇది చూస్తుంటే హార్ట్ బ్రేకింగ్ గా ఉందని చాలామంది కామెంట్ చేస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియోని @Happydog అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.కాగా ఈ వీడియోకి ఇప్పటికే 12 లక్షలకు పైగా వ్యూస్, ఒక లక్ష వరకు లైకులు వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు.“వావ్ ఈ తల్లి చాలా గొప్పది” అని కామెంట్ చేస్తున్నారు.“కుక్కలను చూసి మనుషులు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయ”ని మరి కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.ఈ బ్యూటిఫుల్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube