పీఎఫ్ఐను ఎందుకు నిషేధించారని అడిగే నైతిక హక్కు కూడా కాంగ్రెస్కు లేదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు.ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలంటూ విపక్ష నేత సిద్ధరామయ్య అనడం దురుదృష్టకరమన్నారు.
పీఎఫ్ఐపై నమోదైన కేసులను ఎత్తేసిన ఘనత కాంగ్రెస్ దని విమర్శించారు.చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించాలని అంటున్నారని మండిపడ్డారు.
దేశానికి ఆర్ఎస్ఎస్ ఎంతో చేసిందన్న బొమ్మై.అణగారిన వర్గాలను ఎన్నో సంస్థల ద్వారా ఆదుకుందని స్పష్టం చేశారు.