పాత్ర కోసం గుండు కొట్టించుకోవడానికి సిద్దమైన నటి.. ఎవరంటే?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సెలబ్రిటీల వారసులు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు.అయితే ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారిపోయింది.

 Nia Tripathi New Movie In Tollywood ,nia Tripathi , Balamevvadu Movie , Madhya P-TeluguStop.com

సెలబ్రిటీల పిల్లలతో పాటుగా సాధారణ కుటుంబాలలో పుట్టిన వారు కూడా సినిమా ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపుతున్నారు.హీరోయిన్గా ఎదగాలి అనుకున్న వారు అయితే మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత నటించే అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు.

అలాంటి వారిలో నియా త్రిపాఠి కూడా ఒకరు.

మధ్యప్రదేశ్ కు చెందిన నియా త్రిపాఠి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఎంబీఏలో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ లో శిక్షణ తీసుకుంది.

ఆ తర్వాత మోడల్ కమ్ యాక్టర్ గా సెటిల్ అయిపోయింది నియా త్రిపాఠి.మొదట మోడలింగ్ రంగం నుండి అడ్వటైజ్మెంట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ క్రమంలోనే మలబార్ గోల్డ్, సంతూర్ లాంటి ప్రకటనలలో నటించింది.ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించుకొని ఇప్పుడు తెలుగులో బలమెవ్వడు అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇవ్వబోతోంది నియా త్రిపాఠి.

Telugu Balamevvadu, Madhya Pradesh, Malabar Gold, Medical Mafia, Nia Tripathi, S

బలమెవ్వడు సినిమాలో అవకాశం గురించి మాట్లాడుతూ.ఈ సినిమాలో ప్రధానమైనది మెడికల్ మాఫియా.ఇందులో నేను పోషించిన పాత్ర పేరు పరిణిక.ఆమె ఒక మీట్ చూడు గర్ల్.

తన జీవితంలో ఆమె ఒక పెద్ద ఫైటర్.ఆమెకు క్యాన్సర్ ఉంటుంది.

అటువంటి అమ్మాయి మెడికల్ మాఫియాతో ఏ విధంగా పోరాడింది అన్న అంశాన్ని చాలా చక్కగా దర్శకులు తెరకెక్కించారు అని చెప్పుకొచ్చింది నియా త్రిపాఠి.అంతేకాకుండా ఆ పాత్ర కోసం గుండు కొట్టించుకోవడానికి కూడా తన సిద్ధపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube