జబర్దస్త్ రాఘవ కుమారుడికి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో రాకెట్ రాఘవ ఒకరు.

 Jabardasth Rocket Raghava Son Murari  Remuneration Details, Remuneration ,jabard-TeluguStop.com

ఇక ఈయన కామెడీ స్కిట్ ద్వారా ప్రతివారం ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా తన కుమారుడు మురారిని కూడా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.మురారి కేవలం జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

మురారి ఏ టీంలో చేసినా కానీ తనదైన శైలిలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున అందరిపై పంచ్ లు వేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.ఇక తన తండ్రి రాఘవ స్కిట్ చేస్తే కనుక తన తండ్రిపై వరుస పంచ్ డైలాగులు వేస్తూ అందరిని కడుపుబ్బ నవ్విస్తుంటారు.

ఇక జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ఎంతోమంది చిన్న పిల్లలు కనిపిస్తూ సందడి చేసినప్పటికీ అందరిలో కెల్లా మురారి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఇంత చిన్న వయసులోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బుడ్డోడు తీసుకునే రెమ్యూనరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే.

Telugu Jabardast, Murari, Raghava, Raghava Son, Sridevidrama-Movie

మురారి ఏదైనా స్కిట్ లో పర్ఫామెన్స్ చేస్తే తనకు టీం లీడర్స్ లేదా మల్లెమాలవారు రెమ్యూనరేషన్ అందిస్తారు.ఇలా ఒక్కో కాల్ షీట్ కోసం మురారి ఏకంగా 5000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట.అలా కాకుండా కొంచెం నిడివి ఎక్కువగా ఉన్న స్కిట్ కనుక చేస్తే పదివేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.ఏది ఏమైనా ఈ బుడ్డోడు ఇంత చిన్న వయసులోనే ఒక్కొక్క కాల్ షీట్ కు పదివేల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube