ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ మృతి!

జబర్దస్త్ షో గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఈ షో వల్ల ఎంతోమంది కమెడియన్లు ఆర్థికంగా స్థిరపడ్డారు.జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో మిమిక్రీ మూర్తి ఒకరు.

 Jabardasth Comedian Mimicry Murthy Passed Away Details Here Jabardasth Comedian-TeluguStop.com

అయితే అనారోగ్య సమస్యల వల్ల ఈ ప్రముఖ కమెడియన్ మృతి చెందారు.మిమిక్రీ ఆర్టిస్ఱ్ గా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న మిమిక్రీ మూర్తి జబర్దస్త్ షో ద్వారా ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు.

పాంక్రియాస్ క్యాన్సర్ తో గత కొంతకాలంగా బాధ పడుతున్న ఈ కమెడియన్ క్యాన్సర్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించడంతో మృతి చెందారని తెలుస్తోంది.మిమిక్రీ మూర్తి మరణ వార్త తెలిసి జబర్దస్త్ కమెడియన్లు శోకసంద్రంలో మునిగిపోయారు.

జబర్దస్త్ మాజీ కమెడియన్లలో ఒకరైన అప్పారావు మిమిక్రీ మూర్తి మరణ వార్త నిజమేనని వైరల్ అవుతున్న వార్త గురించి స్పష్టతనిచ్చారు.

ఆర్థిక సమస్యల వల్ల మిమిక్రీ మూర్తికి చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని సమాచారం అందుతోంది.

కొంతమంది స్నేహితులు ఆయనకు ఆర్థిక సహాయం చేశారని 16 లక్షల రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేసినా క్యాన్సర్ నుంచి కోలుకోలేక మిమిక్రీ మూర్తి మృతి చెందారని సమాచారం.క్యాన్సర్ కు వాడే మందులు సైతం మిమిక్రీ మూర్తి హెల్త్ పై దుష్ప్రభావాలను చూపించాయని సమాచారం.

Telugu Cancer, Jabardasth, Mimicry Murthy, Tollywood-Movie

చాలా సంవత్సరాల క్రితమే మిమిక్రీ మూర్తికి క్యాన్సర్ నిర్ధారణ అయిందని తెలుస్తోంది.మిమిక్రీ మూర్తి ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో పలువురు సినీ ప్రముఖులు మరణించగా తక్కువ సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మిమిక్రీ మూర్తి కుటుంబానికి సినీ ప్రముఖులు ఎవరైనా ఆర్థికంగా అండగా నిలిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube