బిగ్ బాస్ రెమ్యునరేషన్ ను రివీల్ చేసిన షాని.. అది బాధాకరం అంటూ?

బిగ్ బాస్ షో సీజన్6 మొదలయ్యే సమయంలో షాని పేరు పెద్దగా వినిపించలేదు.అయితే బిగ్ బాస్ నిర్వాహకులు చివరి నిమిషంలో షానిని ఎంపిక చేయడం జరిగింది.

 Shani Reveals About Bigg Boss Show Remuneration Details Here Goes Viral , Bigg B-TeluguStop.com

సై సినిమాలో షాని నటించినా ఆ తర్వాత పెద్దగా గుర్తింపు లేని పాత్రలలో నటించడం ఆయనకు మైనస్ గా మారింది.బిగ్ బాస్ షోలో ఇతర కంటెస్టెంట్లలా షాని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు.

రెండోవారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షానీకి సంబంధించి కనీసం ఏవీ కూడా ప్రసారం చేయకపోవడంపై సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాని మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

వారానికి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల చొప్పున బిగ్ బాస్ షోకు రెమ్యునరేషన్ దక్కిందని షాని వెల్లడించడం గమనార్హం.

Telugu Bigg Boss Show, Biggboss, Shanireveals, Shani Salmon-Movie

హౌస్ లో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకు రెమ్యునరేషన్ ఇచ్చేవిధంగా ఒప్పందం కుదిరిందని షాని చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ హౌస్ లో నేను రెండు వారాల పాటు ఉన్నా నాకు సంబంధించిన ఏవీని ప్రదర్శించకపోవడం బాధ కలిగించిందని అన్నారు.బిగ్ బాస్ షో నిర్వాహకులు నాకంటూ కొన్ని జ్ఞాపకాలు కూడా లేకుండా చేశారని షాని అన్నారు.

షాని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Bigg Boss Show, Biggboss, Shanireveals, Shani Salmon-Movie

బిగ్ బాస్ షో సీజన్6 షానికి ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.షాని సినిమాలతో బిజీ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.షాని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తనకు మంచి పేరు తెచ్చిపెట్టే ప్రాజెక్ట్ లకు మాత్రమే షాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ అన్నారు.రాజమౌళి సినిమాలలో షాని నటించాలని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube