గ్రేట్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య పనుల వర్కర్ల నియామకంలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు.వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే కొందరు అధికారులతో పాటు స్థానిక అధికార పార్టీ నేతలు కలిసి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి ముడుపులు అందుకున్నట్లు తెలిపారు.
దీనిపై ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.