వైరల్: నిద్రపోతున్న గ్రామసింహాన్ని లేపిన చిలుక... ఏం జరిగిందంటే?

సోషల్ మీడియా రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది.ఈ ప్రపంచంలోని దాదాపు 70 శాతం మంది జనాభా సోషల్ మీడియాలోనే కాపురం చేస్తున్నట్టు తెలుస్తోంది.

 Viral  What Happened To The Parrot That Woke Up The Sleeping Village Lion , Do-TeluguStop.com

తాజా సర్వేలు అదే విషయాన్ని బయటపెట్టాయి.ముఖ్యంగా అనేకరకాల ఫన్నీ వీడియోలకు ఇందులో మంచి గిరాకీ వుంది.

చాలామంది వాటిని క్యాష్ చేసుకొనేవారూ లేకపోలేదు.ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా ఇక్కడ వైరల్ అవుతుంటాయి.

నెటిజన్లు ఇలాంటి వీడియోలను బాగా చూస్తున్నారు.

ఈ క్రమంలో చిలుకలకు సంబంధించినటువంటి ఎక్కువ వీడియోలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

ఎందుకంటే చిలుకలు అత్యంత అందమైన పక్షులు మాత్రమే కాదు.చాలా తెలివైనవి కూడా.

అవి మనుషులును, ఇతర జంతువులను అనుకరిస్తూ మిమిక్రీ కూడా చేయగలవు.ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఓ చిలిపి చిలుకకు సంబంధించినటువంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

ఇక్కడ మనకు కనిపిస్తున్న వీడియోలో తెల్ల చిలుక కుక్క గొంతును అనుకరించిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

ఆ వీడియోలో ఒక కుక్క తన బెడ్ మీద హాయిగా నిద్రపోతోంది.దాని మానాన దాన్ని ఉండనీక దాన్ని లేపడానికి తెల్ల చిలుక చాలా ట్రై చేస్తోంది చూడండి.

చివరకు ఆ చిలుక భౌ.భౌ.అని కుక్కలా మొరగడం మొదలు పెట్టింది.మనుషుల స్వరాలను అనుకరించే చిలుకలనే చాలా మంది చూసి ఉంటారు.

అయితే, ఈ చిలుక కుక్కలా మొరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.ఆ చిలుక ట్యాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube