ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక అక్టోబర్ 17న జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంట నెలకొంది.అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గెలవబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
నామినేషన్ల చివరి తేదీ సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ఎవరెవరు బరిలో ఉంటారనేది తేలిపోతుంది.ఈ క్రమంలో తను అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎవరుంటారనే విషయాన్ని సోనియా గాంధీ నిర్ణయిస్తారన్నారు.
అధ్యక్షుడు ఎవరైనా నిర్ణయం మాత్రం సోనియానే తీసుకుంటారన్నారు.