సమంత ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుందా? లేదా?

స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు వెయిట్ చేసిన విషయం తెలిసిందే.ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Is Samantha Attend Shakuntalam Movie Promotions , Film News, Gunashekhar,samanth-TeluguStop.com

సినిమా కు సంబంధించిన విడుదల తేదీని అధికారికం గా గుణశేఖర్ ప్రకటించాడు.నవంబర్ 4 వ తారీఖున ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

సినిమా విడుదల తేదీ అధికారికంగా వచ్చిన నేపథ్యం లో సమంత ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అందుకు కారణం ఈ మధ్య ఆమె గురించి రకరకాలుగా పుకార్లు షికారులు చేస్తున్నాయి.

అసలు ఆమె కొన్ని వారాలుగా కనిపించడం లేదు అందుకే ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుందా లేదా అంటూ కొందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Gunashekhar, Samantha, Shakuntalam, Telugu-Movie

కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం కచ్చితంగా సమంత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఆమె డేట్లు తీసుకున్న తర్వాతే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు అనువుగా విడుదల తేదీని ప్రకటించారు అంటూ సమాచారం అందుతోంది.లేడీ ఓరియంటెడ్ సినిమా, అది కూడా సమంత నటించిన సినిమా అవడం వల్ల ప్రమోషన్ కార్యక్రమాలను ఆమె తప్ప మరెవ్వరూ చేసినా కూడా అంతగా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు.

అందుకే ఆమెతో ప్రమోషన్ కార్యక్రమాలను చేయించేందుకు గుణశేఖర్ ఇప్పటికే ప్లాన్ చేశాడు.అక్టోబర్ మొదటి వారం నుండే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అవుతాయని గుణశేఖర్ అండ్ టీం అధికారికంగా ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు సమంత ప్రమోషన్ కార్యక్రమాల్లో సమాధానం చెప్పి క్లారిటీ ఇవ్వనుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube