ఆస్కార్ సర్టిఫికెట్ అవసరమా? ఆర్ఆర్ఆర్ పై నిఖిల్ షాకింగ్ కామెంట్స్!

మామూలుగా ఏదైనా కాంపిటీషన్లో గెలిస్తే దానికి గుర్తింపుగా అవార్డ్స్, సర్టిఫికెట్లు లాంటివి ఇస్తుంటారు.నిజానికి ఇవి ఇస్తేనే గెలిచినట్లు అర్థమని అనుకుంటారు.

 Is An Oscar Certificate Required Nikhils Shocking Comments On Rrr, Oscar Certifi-TeluguStop.com

కానీ ఇది ఇవ్వకున్నా కూడా గెలిచిన అనే ఒక గుర్తింపు ఉంటుంది.ఆ గుర్తింపుకు ఇటువంటి అవార్డులు ఇచ్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మనము గెలిచాము అని పదిమందికి తెలిస్తే సరిపోతుంది తప్ప.అవార్డు అందుకుంటేనే తెలియాల్సిన అవసరం లేదు అంటున్నాడు హీరో నిఖిల్.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి అందరికీ పరిచయమే.

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్ర హీరో అతి తక్కువ సమయంలో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.సంబరం సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో నటించి తన నటనకు మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.స్వామిరారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ప్రస్తుతం మంచి సక్సెస్ తో ముందుకు పోతున్నాడు.

ఇటీవలే విడుదలైన కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.

Telugu Chelloshow, Nikhil, Rrr-Movie

ప్రస్తుతం ఈయన ఖాతాలో మరిన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.ఇదంతా పక్కన పెడితే తాజాగా గెలుపు ఓటమి విషయంలో నిఖిల్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఇంతకు అసలు విషయం ఏంటంటే.

ఇండియా నుంచి ఆస్కార్ కు ‘చెల్లో షో’ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.దీంతో చాలామంది సినీ లవర్స్ ఈ విషయాన్ని అసలు తీసుకోలేకపోతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాను కాదని.అసలు ఇప్పటివరకు కూడా పేరు వినపడని సినిమాను పంపడంపై బాగా ఫైర్ అవుతున్నారు.దీంతో ఈ విషయం గురించి నటుడు నిఖిల్ కూడా స్పందించాడు.తాజాగా ఆయన ఇంగ్లీష్ వెబ్సైట్ కి సంబంధించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే.

ఇలా అంటున్నందుకు సారీ.

ఈ విషయంలో నా నిర్ణయం వేరు అంటూ.అందరికీ ఆస్కార్ అవార్డ్స్ అంటే ఇష్టమే.

కానీ మన సినిమాను ప్రపంచమంతా మెచ్చుకుంది.అభిమానించింది కూడా.

ఇక అదే సినిమాకు అతిపెద్ద అవార్డు అని.ఆర్ఆర్ఆర్ పై అభిమానులు ప్రేమ కురిపించారంటూ.ఆ సినిమా సాధించిన పెద్ద విజయం అదే అంటూ.అలాంటప్పుడు మనకు ఆస్కార్స్ ఎందుకు.

Telugu Chelloshow, Nikhil, Rrr-Movie

మనకంటూ ప్రత్యేకంగా ఫిలింఫేర్, నేషనల్ అవార్డ్స్ లాంటివి ఉన్నాయని అన్నాడు.ఇక తను పర్సనల్ గా ఆస్కార్స్ కు ప్రాధాన్యతను ఇవ్వను అంటూ ఆస్కార్స్ నుంచి మనకు సర్టిఫికెట్ అవసరమా అని ప్రశ్నిస్తూ.మన సినిమాలు అద్భుతం అంటూ.ఇతర దేశాలలో ఇండియా సినిమాలు అదరగొడుతున్నాయి అని.తను స్పానిష్ లో ఆర్ఆర్ఆర్ సినిమా చూసినప్పుడు హౌస్ ఫుల్ అయింది అని.స్పానిష్ వాళ్లంతా ఆ సినిమాను మళ్ళీ మళ్ళీ చూశారు అని.అలాంటప్పుడు మనకు ఆస్కార్స్ నుంచి స్పెషల్ సర్టిఫికెట్ అవసరం లేదు అని అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube