బాక్సర్ గా ఫుట్బాల్ ఆటగాడు రోనాల్డో.. లుక్ అదిరిందిగా..

స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ అయిన క్రిస్టియానో రోనాల్డో అంటే పరిచయం చేయాల్సిన పనిలేదు.ప్రపంచవ్యాప్తంగా ఇతనికి అభిమానులు ఉన్నారు.

 Star Football Player Cristiano Ronaldo Turns Boxer Viral Details, Star Football-TeluguStop.com

ఫుట్బాల్ ప్లేయర్ గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందాడు.అయితే తాజాగా క్రిస్టియానో రొనాల్డో కొత్త లోక్ లో కనిపిస్తున్నాడు.

ఫుట్బాల్ ఆటగాడు రొనాల్డో బాక్సర్‌గా కనిపించాడు.ఇది చూసిన అభిమానులు షాక్ కి గురవుతున్నారు.

సిక్స్ ప్యాక్ తో బాక్సింగ్‌ రింగ్‌లో ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు.ప్రత్యర్థి తో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా రొనాల్డో లుక్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

దీంతో ఫుట్‌బాలర్‌ కంటే బాక్సర్‌గానే రొనాల్డో బాగున్నాడంటూ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

కానీ ఇదంతా ఒక యాడ్‌ కోసమని తెలియగానే ఫ్యాన్స్‌ నోటి మీద వేలేసుకున్నారు.

తాజాగా రొనాల్డో అండర్‌వేర్‌ దుస్తులకు సంబంధించిన ఒక యాడ్‌లో నటించాడు.సీఆర్‌ 7 బ్రాండ్‌ కలిగిన అండర్‌వేర్‌ యాడ్‌కు రొనాల్డో ప్రమోషన్‌ చేశాడు.

బద్దకానికి వ్యతిరేకంగా నా పోరాటం ప్రారంభమైంది అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.ఇక రొనాల్డో ఫిట్‌నెస్‌కు తిరుగులేదు.

మైదానంలో ఒకప్పుడు చిరుత లా కదిలే రొనాల్డొ ఎనర్జీ వెనుక అతని ఫిట్‌నెస్‌ ప్రధాన కారణం అని చెప్పాలి.ప్రపంచంలో అత్యంత పాపులారిటీ కలిగిన ఆటగాడిగా పేరున్న రొనాల్డో ఈ మధ్య ఆటకు తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

Telugu Cr, Football, Manchester, Ronaldo-Latest News - Telugu

ప్రతిష్టాత్మక ఫిఫా ర్యాంకింగ్స్‌లోనూ తొలిసారి టాప్‌-5లో చోటు దక్కించుకోలేకపోయాడు.అయినప్పటికి రొనాల్డోకు అభిమానులలో క్రేజ్‌ మాత్రం తగ్గలేదని తాజా వీడియో నిరూపించింది.రొనాల్డో మాంచెస్టర్‌ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఫుట్‌బాల్‌ తర్వాత రొనాల్డోకు అత్యంత ఇష్టమైన క్రీడ ఎంఎంఏ.అయితే ఫుట్‌బాల్‌ కెరీర్‌ నుంచి తప్పుకున్న తర్వాత ఎంఎంఏ క్రీడలో పెట్టుబడి పెడతానని రొనాల్డొ ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే.కాగా తాను ఫుట్‌బాలర్‌ కాకపోయుంటే కచ్చితంగా మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందేవాడని రొనాల్డో ఒక సందర్భంలో వెల్లడించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube