హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును ఖండించిన ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు..

వర్సిటీ పేరు మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్దనీయం కాదు.తప్పుడు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.

 Khammam Parliament Speaker Kurapati Venkateswarlu Condemned The Change Of Name O-TeluguStop.com

ఇలాంటి దుశ్చర్యలతో జగన్ చరిత్ర హీనుడు కావడం ఖాయం.తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన ఎన్టీఆర్ ను అవమానపరచడం అంటే తెలుగుజాతిని అవమానపరచడమేనని కూరపాటి వెంకటేశ్వర్లు అన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఆయన స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొని ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…1986లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించారని,1998లో చంద్రబాబు ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించారని గుర్తు చేశారు.

వర్సిటీ పేరు మార్పు ఎట్టి పరిస్థితులలోను సమర్ధనీయం కాదని, ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని పార్టీలకతీతంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారన్నారు.ఇలాంటి తరుణంలో వర్సిటీ పేరు మార్పు అనడం దుర్మార్గం మరియు దుశ్చర్య అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube