సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబ్స్ వారు కాల్ చేయవద్దు.... పెళ్లి ప్రకటన వైరల్...

ప్రస్తుత కాలంలో పెళ్లి వయసుకు వచ్చి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి విషయంలో విచిత్రమైన కోరికలను కోరుతూ ఉంటారు.కొందరు అమ్మాయిలైతే నేను సినిమా హీరో లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని వారి మనసులో మాటని చెబుతూ ఉంటారు.

 Software Engineer Jobs They Don't Call.... Marriage Announcement Viral ,software-TeluguStop.com

కొన్ని మ్యాట్రిమోనియల్ ప్రకటనలు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నాయి.ఇటువంటి గుణాలు ఉన్న వారు మాత్రమే కావాలంటూ చేసే కొన్ని పెళ్లి ప్రకటనలు వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా ఒక పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది.యువతి తరపు వారు తాజాగా వరుడు కావాలంటూ ఒక ప్రకటన చేసి చాలామందికి షాక్ ఇచ్చారు.

ఆ ప్రకటన ఏమిటంటే మా అందమైన యువతికి వరుడు కావాలి అని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయితే మాకొద్దు అంటూ ప్రత్యేకంగా పేర్కొన్నారు.

ధనిక వ్యాపార కుటుంబంలోని డిగ్రీ పూర్తిచేసిన వధువుకు ఐపీఎస్‌, వైద్యుడు, వ్యాపారవేత్త అయిన వరుడు కావాలి అని చెబుతూనే,సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కాల్‌ చేయొద్దు అంటూ స్పష్టం చేస్తున్నారు.

కాగా ఈ ప్రకటనకు సంబంధించిన ఫోటోను వ్యాపారవేత్త సమీర్‌ అరోరా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఐటీ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది.అనే వ్యాఖ్యలు జోడించారు.

కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ పెళ్లి ప్రకటనపై నెటిజన్లు స్పందిస్తు కామెడీగా కామెంట్లు కూడా చేస్తున్నారు.

దేశంలో ఎక్కువమంది సాఫ్ట్‌వేర్లే ఉన్నారనే అర్థం వచ్చేలా.అరోరా వ్యాఖ్యలపై కొందరు నేటిజెన్లు అయితే, ఐటీ లేకపోతే దేశ భవిష్యత్తు సరిగా ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.మేం అంత చెడ్డవాళ్లమా అంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన ఆవేదన చెప్పాడు.నాకు 11ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యింది’ అని మరో వ్యక్తి సరదాగా జోక్ చేశాడు.

ఇంకా రాబోయే రోజులలో ఇలాంటివి ఎన్నో రావచ్చని కొన్ని మ్యాట్రిమోనీలా వాదన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube