ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంత డబ్బా ఎక్కువైందా.ఆదివారం జరిగిన అల్లూరి ఈవెంట్ లో ఆయన స్పీచ్ చూసిన ఎవరైనా సరే ఇది నిజమే అని ఒప్పుకోక తప్పదు.
అల్లు అర్జున్ మంచి నటుడు అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. స్టార్ ప్రొడ్యూసర్ తనయుడైనా సరే కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాడు.
పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో కూడా తన సత్తా చాటాడు.అయితే తనకు అందరి హీరోల్లా ఉన్నది ఫ్యాన్స్ కాదు ఆర్మీ అంటూ చెప్పుకునే అల్లు అర్జున్ తన స్పీచ్ లో చాలాసేపు తన ఆర్మీ గురించే మాట్లాడాడు.
అంతేకాదు పాలకొల్లు నుంచి ఎవరైనా వచ్చారా.ఎందుకంటే మాది పాలకొల్లే లాంటి మాటలు అందరిని షాక్ అయ్యేలా చేశాయి.ఈవెంట్ కి స్టార్ హీరో వస్తున్నాడంటే ఆడిటోరియం ఫిల్ అవడం పెద్ద కష్టమేమి కాదు.కానీ అల్లు అర్జున్ మాత్రం పదే పదే తన ఆర్మీ తన ఆర్మీ అని చెప్పుకోవడం మాత్రం సొంత డబ్బా అన్నట్టుగానే ఉంది.
ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కి ఇది అసలు నచ్చట్లేదని చెప్పొచ్చు. ఈవెంట్ కి వచ్చి ఆ సినిమా గురించి తక్కువ మాట్లాడి మిగతా విషయాలు ఎక్కువ మాట్లాడినట్టు అనిపించిందని కొందరు అంటున్నారు.