కడుపులో బ్యాటరీల ఫ్యాక్టరీ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే.ఆమె పొట్టలో బ్యాటరీల గుట్ట ఒకటి బయట పడింది.
దాన్ని చూసిన వైద్యులు కళ్ళు తిరిగి పోయారు.ఈ వింత ఘటన ఐర్లాండ్ లో చోటు చేసుకుంది.66ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 55 బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు ఐర్లాండ్ వైద్యులు.దాంతో వాటిని తీసేందుకు వారు చాలా తీవ్రంగా శ్రమించారు.
తొలుత ఆమె శరీరం నుంచి సహజంగానే బ్యాటరీలు బయటకు వచ్చేలా వైద్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఫలితం దక్కలేదు.
దాంతో ఇక చేసేదేమి లేక, ఆపరేషన్ ద్వారా సదరు బ్యాటరీలను తొలగించారు.
ఈ బ్యాటరీలు ఆమె పొత్తికడుపులో ఉండటంవల్ల ఆమె జీర్ణకోశ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపలేదని, అదృష్టవశాత్తు ఆమె ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పడం కొసమెరుపు.వివరాలిలా వున్నాయి… ఐర్లాండ్‌లోని సెయింట్ విన్సెంట్ యూనివర్శిటీ ఆస్పత్రిలో ఓ మహిళ కడుపులో నొప్పితో బాధపడుతూ చేరింది.
వైద్యులు ఆమెకు స్కానింగ్ నిర్వహించగా.పొత్తి కడుపులో 55 బ్యాటరీలు పలు రకాల సైజుల్లో ఉన్నట్లు గుర్తించారు.
తొలుత వీటిని సహజంగానే బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నించారు.ఈ విధానం వల్ల వారంలో 5 చిన్నసైజు బ్యాటరీలు బయటకు వచ్చాయి.కానీ పెద్ద సైజువి మాత్రం బయటకు రాలేదు.పలు విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ మిగిలిన బ్యాటరీలు పొత్తికడుపులోనే ఉండిపోయాయని గ్రహించారు డాక్టర్లు.దాంతో మిగిలిన బ్యాటరీలను మహిళ పొట్ట భాగంలో ఒక చిన్న రంధ్రంచేసి బయటకు తీశారు.షాకింగ్ విషయం ఏమంటే, ఆ మహిళ ఆ బ్యాటరీలను కావాలనే మింగిందట.
ప్రస్తుతం దానికి గల కారణం ఏమైయుంటుందని ఆమెని ఆరా తీస్తున్నారు.