పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ మూవీ ఊహించని స్థాయిలో డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడం విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు సాధారణ అభిమానులను సైతం ఒకింత బాధ పెడుతోంది.విజయ్ దేవరకొండ ఈ సినిమా కథకు ఓకే చెప్పి నటించినా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోల జాబితా ఎక్కువగానే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
పూరీ జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆంధ్రావాలా, టెంపర్ సినిమాలు తెరకెక్కాయి.ఆంధ్రావాలా మూవీ ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ ఆశించిన విధంగా లేకపోవడంతో ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.
అయితే తారక్ అభిమానులకు మాత్రం ఈ సినిమా నచ్చింది.ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో టెంపర్ సినిమా తెరకెక్కగా సెకండాఫ్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా సక్సెస్ సాధించింది.
ఎన్టీఆర్ తో ఉన్న చనువుతో పూరీ జగన్నాథ్ లైగర్ కథ చెప్పగా కథ మరీ ఆకట్టుకునేలా లేకపోవడంతో తారక్ ఈ సినిమాకు నో చెప్పారు.ఆ తర్వాత పూరీ జగన్నాథ్ ఈ సినిమా కోసం రామ్ చరణ్ ను సంప్రదించారు.
రామ్ చరణ్ తొలి సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే.ఆ చనువుతోనే పూరీ జగన్నాథ్ రామ్ చరణ్ కు లైగర్ కథ చెప్పారని అయితే వేర్వేరు కారణాల వల్ల చరణ్ కూడా ఈ సినిమాకు నో చెప్పారని బోగట్టా.

పూరీ జగన్నాథ్ ఇంటర్వ్యూలలో బన్నీ వల్లే లైగర్ సినిమా ఐడియా వచ్చిందని తెలిపారు.బన్నీకి కూడా పూరీ ఈ సినిమా కథ చెప్పారని సమాచారం.అయితే కమర్షియల్ అంశాలు మరీ ఎక్కువయ్యాయనే కారణంతో బన్నీ ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.







