ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో కార్యాయలం నుండి ఉద్యోగులకు నోటీసులు అందాయి.సెప్టెంబర్ 1న సీపీఎస్ రద్దు కోరుతూ నిరసన కార్యక్రమం, సీఎం నివాసం ముట్టడి నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.
దీంతో ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.ఒకవేళ ఈ కార్యక్రమాలను అడ్డుకుని నిర్బంధిస్తే.
అక్కడి నుంచే నిరసన తెలుపుతామని చెబుతున్నారు ఉద్యోగులు.గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగ బద్ధమైన హక్కులపై కూడా నిర్బంధం విధించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.