ప్రముఖ టాలీవుడ్ యాంకర్లలో ఒకరైన అనసూయ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఆగ్రహం కలిగించిన సంగతి తెలిసిందే.తమ ఫేవరెట్ హీరో సినిమాను కించపరిచేలా అనసూయ ట్వీట్ ఉండటంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫీలవుతున్నారు.
దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయను టార్గెట్ చేయగా అనసూయ తనను ట్రోల్ చేసేవాళ్లకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.
ఛీ ఛీ అసలు ఇంత చెత్తా.
బాబోయ్ క్లీన్ చేసి విసుగొస్తోందంటూ నెగిటివ్ ట్వీట్ల గురించి అనసూయ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇలాంటి వివాదాలలోకి నా ఫ్యామిలీని లాగితే మిమ్మల్ని జైలుకు పంపించాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.
మీరు ఎన్ని అంటున్నా నేను దయతో వ్యవహరిస్తున్నానని అయినా మీరిలా చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.ఇకపై నన్ను ఆంటీ అని పిలుస్తూ అవమానించే విధంగా పోస్టులు పెడితే పోలీస్ కేసులు పెడతానని ఆమె హెచ్చరించారు.
తనకు నెగిటివ్ గా పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ స్క్రీన్ షాట్ తీసుకుంటానని ఆమె అన్నారు.
సరైన కారణం లేకుండా నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లను బాధపడే స్థాయికి తీసుకెళతానని ఆమె కామెంట్లు చేశారు.నన్ను వేధిస్తూ మీరు చేస్తున్న ట్వీట్లను ఇకపై రీట్వీట్ చేస్తానని ఆమె తెలిపారు.నన్ను వేధించడం కోసం డబ్బులు చెల్లించి ఫేక్ ప్రొఫైల్స్ తో గత కొన్నేళ్ల నుంచి ట్వీట్లు చేయిస్తున్నారని ఆమె తెలిపారు.
అసలేం జరిగిందో మీకు ఏ మాత్రం తెలియదని అనసూయ తెలిపారు.అనసూయ రియాక్ట్ అయిన తీరులో ఏ మాత్రం తప్పు లేదని అయితే సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఒక సినిమా ఫ్లాపైతే ఆమె ఆ సినిమా యూనిట్ కు మరింత కోపం తెప్పించేలా పోస్ట్ లు పెట్టడం కరెక్ట్ కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.