రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు.కానీ, పోషకాల కొరత, వేళకు ఆహారం తీసుకోకపోవడం, బిజీ లైఫ్ స్టైల్, శరీరానికి సరిపడా వాటర్‌ను అందించకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల మధ్యాహ్నానికే విపరీతమైన నీరసం వచ్చేస్తుంటుంది.
ఇలా మీకు జరుగుతుందా.? అయితే డోంట్ వర్రీ.ఇకపై ఇప్పుడు చెప్పబోయే హై ప్రోటీన్ సలాడ్‌ను మీ బ్రేక్ ఫాస్ట్‌లో చేర్చండి.ఈ సలాడ్ మీకు అవసరం అయ్యే ఎన్నో పోషక విలువలను అందించడమే కాదు.
మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.మరి లేట్ చేయకుండా ఆ సలాడ్ ను ఎలా సిద్ధం చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి తురుము వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఉడికించుకున్న కాబూలీ సెనగలు, వన్ కప్పు ఉడికించుకున్న స్వీట్ కార్న్, ఒక కప్పు ఉడికించుకున్న రాజ్మా, ఒక కప్పు ఉడికించుకున్న కొర్రలు, ఒక కప్పు ఉల్లిపాయ తరుగు, అర కప్పు టమాటో తరుగు, అర కప్పు కీర తురుగు వేసుకుని కలుపుకోవాలి.
చివరిగా అందులో మొదట తయారు చేసి పెట్టుకున్న నువ్వుల నూనె మిశ్రమం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే హై ప్రోటీన్ సలాడ్ సిద్దం అయినట్లే.ఈ సలాడ్ ను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే రోజంతా శరీరానికి అవసరం అయ్యే శక్తి లభిస్తుంది.నీరసం, అలసట వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఫుల్ డే ఎనర్జిటిక్‌గా కూడా ఉంటారు.