సీఎం దత్తత గ్రామనికి బసు లేదని ధర్నా

యాదాద్రి జిల్లా:తుర్కపల్లి మండలంలో సీఎం కెసిఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామానికి బస్సు సౌకర్యం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓర్సు భిక్షపతి ఆధ్వర్యంలో గజ్వేల్-భువనగిరి ప్రధాన రహదారిపై విద్యార్థులు,గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు.గంటపాటు ఈ నిరసన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

 There Is No Bus For Cm's Adopted Village-TeluguStop.com

ఈ సందర్భంగా ఓర్సు భిక్షపతి మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామానికే ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం అన్నారు.ఈ గ్రామం నుండి పాఠశాలకు,కళాశాలకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దత్తత గ్రామంలో ఈ పరిస్థితి ఉంటే ఇక రాష్ట్రంలో ఇతర గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరారు.ఇప్పటికైనా సీఎం ప్రత్యేక దృష్టి సారించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube