మెగాస్టార్ చిరంజీవి మరో సారి తన మంచి మనసును చాటుకున్నారు.ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలకు తాను భరోసా అన్నట్లుగా నిలిచి వారికి సాయం చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి మరో సారి మంచి మనసుని చాటుకుంటున్నాడు.
ఆయన చిత్రపురి కాలనీ లో ఎన్ని కోట్లు ఖర్చయినా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఏర్పాటు చేస్తానంటూ అధికారికంగా ప్రకటించారు.గతంలోనే మెగా స్టార్ చిరంజీవి ఒక భారీ హాస్పిటల్ అని నిర్మించబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అందుకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు.తన తండ్రి పేరు మీద చిత్ర పురి కాలనీ లో సినీ కార్మికుల కోసం భారీ ఎత్తున కార్పొరేట్ హాస్పిటల్ ని ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించాడు.
అందుకు గాను ఎన్ని కోట్లు ఖర్చు అయినా తాను పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని, తన వద్ద అంత డబ్బు ఉంది అన్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చాడు.
తన బర్త్ డే సందర్భంగా చెప్తున్నా ఈ విషయం వచ్చే బర్త్ డే నాటికి పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చాడు.వచ్చే బర్త్ డే నాటికి హాస్పటల్ ని పూర్తి చేసి జనాలకు అందుబాటులోకి తీసుకు వస్తానంటూ మెగా స్టార్ చిరంజీవి హామీ ఇవ్వడం తో చిత్ర పురి కాలనీ నివాసులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే గాడ్ ఫాదర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరో వైపు భోళా శంకర్ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఇక బాబీ దర్శకత్వం లో వాల్తేరు వీరన్న అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఆచార్య సినిమా నిరాశ పర్చిన కారణంగా కాస్త స్లో అయిన మెగా స్టార్ చిరంజీవి వచ్చే ఏడాది వరుసగా సినిమా లతో టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమంటూ టాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి తో కొత్త సినిమాలు చేసేందుకు యువ దర్శకులు ఆసక్తిగా ఉన్నారు.
చిరు కూడా వారికి అవకాశాలు ఇస్తూ కొత్త వారిని ప్రోత్సహిస్తున్నారు.