ఏంటి లైగర్ 2 కూడా ఉంటుందా..?

విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా లైగర్.ఆగష్టు 25న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు.

 Vijay Devarakonda About Liger 2 ,  Ananya Pandey,charmy, Karan Johar,liger, Lige-TeluguStop.com

సౌత్ టూ నార్త్ విజయ్ తన మార్క్ ప్రమోషన్స్ తో అదరగొడుతున్నాడు.ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో లైగర్ సీక్వల్ కూడా ఉంటుంది అన్న క్లూ ఇచ్చాడు హీరో.

లైగర్ సినిమాకు సీక్వల్ ఆలోచన కూడా ఉందని.పూరీ మైండ్ లో అది కూడా ఉందని అన్నాడు విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో క్రేజ్ బాగా ఉంది.అందుకే లైగర్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాలో విజయ్, అనన్యా పాండేల జోడీ సినిమాకు హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటించారు.

సినిమాకి ప్రీ రిలీజ్ బజ్ బాగుంది మరి సినిమా ఆ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.లైగర్ హిట్ అయితే లైగర్ 2 కూడా లైన్ లో ఉండొచ్చని చిత్రయూనిట్ మాటలని బట్టి అర్ధమవుతుంది.

ఆల్రెడీ పూరీ జగన్నాథ్ తో విజయ్ లైగర్ తర్వాత జన గణ మన సినిమా చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube