కెనడా : ఖలిస్తానీ వేర్పాటువాదుల అడ్డాలో తొలిసారిగా పంద్రాగస్ట్ వేడుకలు

75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో ఎన్ఆర్ఐలు భారీ ఏర్పాట్లు చేశారు.

 In A First, India's Independence Day Celebrations Held In Canada's Hotbed Of Kha-TeluguStop.com

ఇక ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా పేరిట ఇచ్చిన పిలుపు మేరకు భారతీయులు ఆగస్ట్ 15కి ముందు నుంచే తమ ఇళ్లపై జాతీయ పతాకాలను ఎగురవేశారు.అలాగే పలువురు దేశాధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన కెనడాలోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.అయితే వాంకోవర్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తొలిసారిగా సర్రే నగరంలో పంద్రాగస్ట్ వేడుకలు నిర్వహించడం విశేషం.

బ్రిటీష్ కొలంబియాలోని సర్రే తొలి నుంచి ఖలిస్తానీ వేర్పాటువాదులకు కేంద్రంగా వున్న సంగతి తెలిసిందే.సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా, దష్మేష్ దర్బార్ గురుద్వారాలు భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి.1985లో కనిష్క విమాన ప్రమాదం కుట్రకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని.తర్వాత నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ మాలిక్ హత్య తర్వాత ఖలిస్తాన్ రాడికల్ గ్రూపుల కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇలాంటి పరిస్ధితుల మధ్య బ్రిటీష్ కొలంబియాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగడం గమనార్హం.

Telugu Amritmahotsav, Azadikaamrit, Canada, Columbia, India, India British, Kani

ఇకపోతే.నగరంలో ఆగస్ట్ 15, 2022ని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ డే గా ప్రకటిస్తూ సర్రే మేయర్ డౌ మెక్‌కల్లమ్ ఒక ప్రకటనను విడుదల చేశారు.ఈ ప్రకటన భారత్ – బ్రిటీష్ కొలంబియాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని హైలైట్ చేసింది.

ఇక్కడ దాదాపు 4,00,000 మంది భారత సంతతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు.నానైమో, బర్నబీ, విక్టోరియా, న్యూ వెస్ట్‌మినిస్టర్‌ మేయర్‌లు సైతం భారత స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి ప్రకటనలు చేశారు.

బర్నాబీలోని మైఖేల్ జె.ఫాక్స్ థియేటర్‌లో ‘అమృత్ మహోత్సవ్ కన్సర్ట్’’ నిర్వహించారు.ఈ సందర్భంగా కథక్, లావ్ని, భరతనాట్యంతో పాటు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube