బిగ్ బాస్ 6 : కంటెస్టెంట్స్ కొత్త లిస్టు ఇదే.. హౌస్ లోకి వెళ్ళేది ఎవరెవరంటే?

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు ఆరవ సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.మధ్యలో బిగ్ బాస్ ఓటిటి తో రచ్చ రచ్చ చేసారు.

 Bigg Boss Season 6 Telugu Contestants List Details, Bigg Boss Telugu Season 6,na-TeluguStop.com

ఇక ఇప్పుడు సీజన్ 6 స్టార్ట్ చేయడానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టు బిగ్ బాస్ నిర్వాహకుల నుండి సమాచారం అందుతుంది.

ఈసారి కూడా నాగార్జున నే హోస్ట్ గా వస్తున్నాడు.

సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ అంటూ సీజన్ 6 ప్రోమో రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ కాబోతున్న ఈ సీజన్ లో ఈసారి ఎవరెవరు పాల్గొనబోతున్నారు అంటూ అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరోపక్క సీజన్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

తాజాగా వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిష్టు ఒకసారి పరిశీలిస్తే.

ఆ కంటెస్టెంట్స్ లిస్టులో ఒక యాంకర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

Telugu Apparao, Bigg Boss, Biggboss, List, Geetu Royal, Nagarjuna, Neha Choudhar

యాంకర్ ఉదయభాను ఈసారి బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నట్టు ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది.ఏమిటో పాటు నేహా చౌదరి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యిందట.ఈమె అందాల ఆరబోతతో ప్రేక్షకులను మాయ చేయబోతుంది అని తెలుస్తుంది.

వీరితో పాటు యుట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పే ఆది తో పాటు మరో యూట్యూబర్ గీతూ రాయల్ కూడా పాల్గొనబోతుందట.

Telugu Apparao, Bigg Boss, Biggboss, List, Geetu Royal, Nagarjuna, Neha Choudhar

అలాగే సిరి హనుమంతు ప్రియుడు శ్రీహన్ కూడా ఈసారి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.ఇంకా జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అప్పారావు కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.

అలాగే మరికొంత మంది బుల్లితెర, వెండితెర నటులతో పాటు ముగ్గురు సామాన్యులు సైతం ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారు అని తెలుస్తుంది.

మరి గతం కంటే ఈసారి మరింత రసవత్తరంగా బిగ్ బాస్ షో ఉంటుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube