గిరిజ‌నుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ లక్ష్యం..పాడేరు శాస‌న స‌భ్యులు కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ చింతపల్లి న‌క్స‌లైట్ల ప్ర‌భావిత ప్రాంతాల్లో పాడేరు శాస‌న స‌భ్యులు కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఆ గ్రామాల‌కు వెళ్లిన తొలి ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి గిరిజ‌నుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యమ‌న్న MLA కొట్ట‌గుళ్ళి భాగ్య లక్ష్మి ఆ ప్రాంతం వెళ్లాలంటే అధికారుల‌కు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు భ‌యం….ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందోన‌నే ఉత్కంఠ .

 The Welfare Of Tribals Is The Goal Of The Government Kottagulli Bhagyalakshmi, K-TeluguStop.com

అటువంటి చోట పాడేరు శాస‌న స‌భ్యులు కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి బుధ‌వారం సుడిగాలి పర్యటన మ‌న స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ ఊల్లెల‌కు వెళ్ల‌లేదు.తొలిసారి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి ర‌హ‌దారి సౌక‌ర్యం కూడా లేని ప్రాంతాల్లో కొండ‌లు , వాగులు, వంక‌లు దాటుతూ ప్ర‌జ‌ల యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు తీరు గురించి ఆరా తీశారు.అవే జీకేవీధి మండ‌లం దేవ‌రాప‌ల్లి పంచాయ‌తీ గోన‌లంక‌, దేవ‌రాప‌ల్లి, రామ‌గ‌డ్డ‌, మంగ‌ళ‌పాలెం గ్రామాలు…ఈ గ్రామాల‌న్నీ న‌క్స‌లైట్ల ప్రభావం ఎక్కువ‌గా ఉన్న ప‌ల్లెలు…అటువంటి గ్రామాల‌కు గౌర‌వ‌ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పోలీసుల హెచ్చ‌రిక‌లను బేఖాత‌రుల చేసి మ‌రీ ఆ గ్రామాల్లో నిర్వ‌హించి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాడేరు శాస‌న స‌భ్యులు శ్రీ‌మ‌తి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి పాల్గొన్నారు.కాదు…తెల్ల‌వార‌క‌ముందే ఆ ప‌ల్లెల్లో వాలిపోయిన శాస‌న స‌భ్యులు మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ అక్క‌డే ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు ల‌బ్ధిదారుల‌కు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.మొత్తంగా 246 గ‌డ‌ప‌ల‌ను సంద‌ర్శించారు.

ప్ర‌తి గ‌డ‌ప‌లోనూ భాగ్య‌ల‌క్ష్మి గారికి సాద‌ర స్వాగ‌తం ల‌భించింది.స్థానికులు శాస‌న స‌భ్యులు వారిని చూసి అంతా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు గిరిజ‌నులు సంక్షేమ‌మే ప్ర‌భుత్వం ల‌క్ష్యమ‌ని ఈ సంద‌ర్భంగా భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు.

అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపించాల‌న్న‌దే గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గారి ల‌క్ష్య‌మ‌ని ఆమె పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube